RRTS Corridor | హైస్పీడ్ రైలు, మెట్రో రెండూ ఒకే ట్రాక్‌పై.. మీరట్ ప్రయోగం సూపర్ సక్సెస్
నమో భారత్ అనేది భారత్‌లోనే తొలి రీజనర్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది న్యూఢిల్లీలోని సారాయ్ కలే ఖాన్ స్టేషన్ నుంచి నార్త్ మీరట్‌లోని మోదీపురాన్ని కనెక్ట్ చేస్తుంది. 82 కిమీల దూరం ఉన్న కారిడార్ ఇది.
RRTS Corridor | సాధారణంగా బుల్లెట్, హైస్పీడ్ లాంటి రైళ్లు పరిగెత్తాలంటే వాటి కోసం ప్రత్యేకమైన రైల్వే ట్రాక్ నిర్మించాలి. విదేశాల్లో బుల్లెట్ ట్రెయిన్స్ కోసం సపరేట్ ట్రాక్ ఉంటుంది. మన దగ్గర ఇంకా బుల్లెట్ రైళ్లు రాలేదు కానీ.. హైస్పీడ్ ట్రెయిన్స్ ప్రారంభమయ్యాయి. వందే భారత్ రైళ్లు హైస్పీడ్ కంటే కొంచెం తక్కువ స్పీడ్‌తోనే వెళ్తాయి. ఇటీవల నమో భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రధాని మోదీ మీరట్‌లో రీజనర్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కారిడార్ స్పెషాలిటీ ఏంటంటే.. ఒకే ట్రాక్‌పై హైస్పీడ్ రైలు, మెట్రో పరుగులు పెడుతున్నాయి. న్యూఢిల్లీ నుంచి మీరట్‌కి హైస్పీడ్ రైలు, మీరట్‌లోని కొన్ని స్టేషన్ల వరకు మెట్రో రైలు ఇదే ట్రాక్‌పై నడుస్తున్నాయి. అందుకే ఈ రెండు ప్రాజెక్టులను మోదీ ఒకేసారి ప్రారంభించారు.
హైస్పీడ్ రైలుకి నాలుగే స్టాప్స్
న్యూఢిల్లీ నుంచి మీరట్ వరకు నడిచే హైస్పీడ్ రైలుకి నాలుగే స్టాప్స్ ఉంటాయి. మీరట్ మెట్రోకి 13 స్టాప్స్ ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రాంతీయ రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకే ఈ కారిడార్‌ను రైల్వే శాఖ నిర్మించింది. దీని వల్ల ఇండియాలోనే తొలిసారి మీరట్‌లో ఆర్ఆర్‌టీఎస్, మెట్రో రెండూ ఒకే ట్రాక్‌పై నడుస్తున్నాయి.

నమో భారత్ అంటే ఏంటి?
నమో భారత్ అనేది భారత్‌లోనే తొలి రీజనర్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది న్యూఢిల్లీలోని సారాయ్ కలే ఖాన్ స్టేషన్ నుంచి నార్త్ మీరట్‌లోని మోదీపురాన్ని కనెక్ట్ చేస్తుంది. 82 కిమీల దూరం ఉన్న కారిడార్ ఇది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దీన్ని నిర్మించింది. సెమీ హైస్పీడ్ రీజనల్ ట్రావెల్ కోసం దీన్ని డిజైన్ చేశారు. 180 కిమీల వరకు హైస్పీడ్‌తో ఈ ట్రాక్ మీద రైలు వెళ్లగలదు. న్యూఢిల్లీ నుంచి మీరట్‌కి హైస్పీడ్ రైలు ద్వారా 55 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్తే కనీసం రెండు గంటలు పడుతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






