T20 World Cup 2026 | వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ప్రకటించిన ఐసీసీ.. జూన్ 14న భారత్-పాక్ మ్యాచ్..!
T20 World Cup 2026 | ఐసీసీ వుమెన్స్ టీ20 2026 వరల్డ్ కప్ జూన్ నుంచి మొదలుకానున్నది. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శ్రీలంకతో తలపడుతుంది.
T20 World Cup 2026 | ఐసీసీ వుమెన్స్ టీ20 2026 వరల్డ్ కప్ జూన్ నుంచి మొదలుకానున్నది. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శ్రీలంకతో తలపడుతుంది. ఈ టోర్నీ జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరుగనున్నది. వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా 12 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. జూన్ 14న ఎడ్జ్‌బాస్ట్‌లో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్నది.
జులై 5న ఫైనల్..
ఫైనల్ మ్యాచ్ జులై 5న లండన్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గత నెలలో నేపాల్‌లో జరిగిన ఐసీసీ వుమెన్స్ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ పోటీల్లో నాలుగు జట్లు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ బరిలోకి దిగనున్నది. ఈ సారి 10 పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇక గ్రూప్2-లో వెస్టిండిస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
తొలిసారిగా నెదర్లాండ్స్ జట్టు..
నెదర్లాండ్స్ తొలిసారిగా వుమెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడబోతోంది. ఈ యువ జట్టు భారతదేశం, ఆస్ట్రేలియా వంటి భపెద్ద జట్లతో తన అదృష్టాన్ని పరీక్షించోబోతోంది. ఈ టోర్నమెంట్‌లో ఐదు ట్రిపుల్ హెడర్లు (ఒకే రోజులో మూడు మ్యాచ్‌లు), ఐదు డబుల్ హెడర్లు (ఒకే రోజులో రెండు మ్యాచ్‌లు) జరుగుతాయి. నాకౌట్ మ్యాచులు జూన్ 30, జూలై 2 తేదీల్లో ఓవల్ జరుగుతాయి. ఈ సందర్భంగా ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా మాట్లాడుతూ 2026 మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ని విడుదల చేయడం కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు.

Read Also :
Semifinal Qualification Scenario | వెస్టిండీస్, జింబాబ్వేపై గెలిస్తే భారత్ సెమీస్‌కు వెళ్తుందా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?
Steve Bucknor | సచిన్‌ను తప్పుగా ఔట్ ఇచ్చానని ఎట్టకేలకు ఒప్పుకున్న అంపైర్ స్టీవ్ బక్నర్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






