త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌర‌వం.. స్మిత్‌ను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్కరించిన యూఏఈ

Captain Smit Machchhar | ఫ్లైదుబాయ్ (Flydubai) హీరో, భార‌తీయ పైల‌ట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. యూఏఈ ప్ర‌భుత్వం ఆయ‌న్ని అత్యున్న‌త పుర‌స్కారం ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’తో (First Class Order of Zayed II) స‌త్క‌రించింది.

D

National | Published On Oct 28, 2026, 1.18 pm IST

Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌర‌వం.. స్మిత్‌ను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్కరించిన యూఏఈ
Advertisement

Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్ : ఫ్లైదుబాయ్ హీరో, భార‌తీయ పైల‌ట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar)కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. విమానం కూల్చివేత ప్రయత్నాన్ని వీరోచితంగా అడ్డుకుని 180 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు యూఏఈ (UAE) ప్ర‌భుత్వం ఆయ‌న్ని అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ (First Class Order of Zayed II ) పురస్కారాన్ని ప్ర‌దానం చేసింది.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స‌మ‌క్షంలో.. యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్‌ యువరాజు హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ ఈ అవార్డును మచ్చర్‌కు స్వ‌యంగా అంద‌జేశారు. మ‌చ్చ‌ర్‌తోపాటూ విమాన సిబ్బంది కూడా ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి వారు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్ర‌శంసించారు.

Image

కాగా, దుబాయ్‌-టెల్‌అవీవ్‌ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్‌కి (Flydubai) చెందిన‌ బోయింగ్‌ 737 MAX 8 విమానాన్ని కూల్చివేసేందుకు తన సహ-పైలట్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే క్ర‌మంలో స్మిత్ క‌త్తిపోట్లకు గురైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తీవ్ర గాయాల‌తో ఆయ‌న ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. ఈ ప్ర‌మాదం నుంచి 180 మంది ప్ర‌యాణికుల‌ను కాపాడిన మ‌చ్చ‌ర్‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఆయ‌న‌కు ఇప్ప‌టికే ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారం ‘ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం’ను ప్రకటించింది. అంతేకాదు, గుజ‌రాత్ ప్ర‌భుత్వం కూడా మ‌చ్చ‌ర్‌కు ఆ రాష్ట్ర విశిష్ట పుర‌స్కార‌మైన 'గుజరాత్ గరిమా అవార్డు' (Gujarat Garima Award)ను ప్ర‌క‌టించింది.

Image

Also Read..

టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీల‌క ప్ర‌తిపాద‌న‌

రైళ్ల‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

Advertisement
Advertisement