Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం
Congress | సికింద్రాబ్‌లోని రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ నిరసనకు రైళ్లు ఇంచ్చేందుకు నిరాకరించడంతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ధర్నాలో (Dharna) పాల్గొన్నారు.
Congress | త్రినేత్ర న్యూస్: సికింద్రాబ్‌లోని రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ నిరసనకు రైళ్లు ఇంచ్చేందుకు నిరాకరించడంతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ధర్నాలో (Dharna) పాల్గొన్నారు. రైల్వే నిలయంలోని (Rail Nilayam) జీఎం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ధర్నాలో పీసీసీ చీఫ్‌తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేశ్, డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్, దీపక్ జాన్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ (Mahesh Goud).. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఢిల్లీకి వెళ్లి తీరుతామని, నవంబర్ 1న జరుగనున్న నిరసనను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రత్యేక రైళ్లలో వెళ్లడానికి ప్రణాళిక చేస్తే 5 రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వని రైల్వే శాఖ.. తీరా సమయం దగ్గర పడిన తర్వాత మంగళవారం దరఖాస్తును తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్ల అనుమతి నిరాకరణలో కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని మండిపడ్డారు. ఢిల్లీకి తరలివెళ్లేందుకు కార్యకర్తలకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
Congress Stages Protest at Secunderabad Railway Station Over Denial of Trains for November 1 Delhi Protest
సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా
నవంబర్ 1 వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు రైళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీ కి వ్యతిరేకంగా నినాదాలు
ధర్నాలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, డిసిసి అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, ఇతర ముఖ్య నేతలు అధికారులు
నిరసనలో నగరం నలుమూలల నుండి భారీగా పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు
సికింద్రాబాద్ రైల్వే నిలయం లోని జిఎం కార్యాలయం ముందు బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
— Congress for Telangana (@Congress4TS) October 28, 2026
సంబంధిత వార్తలు

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
అక్టోబర్ 28, 2026

BJP Protest Kharge Residence | మోదీ తండ్రిని అంత మాటంటవా? ఖర్గే ఇంటిని చుట్టుముట్టిన బీజేపీ నేతలు
అక్టోబర్ 26, 2026

Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
- ●IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు
- ●Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..
- ●Indian Railways | రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
- ●Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి
- ●Hindustan Unilever | హెచ్‌యూఎల్ షేర్హోల్డర్లకు రూ.19 డివిడెండ్.. రికార్డు తేదీ ఇదే..

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు

Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..

Indian Railways | రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి



