Rahul Gandhi | టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ
Rahul Gandhi | టాటా సంస్థను (Tata group) నేరపూరితంగా నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ఒక్క వ్యాపారవేత్త కూడా దీనిపై మాట్లాడడానికి సాహసించడం లేదని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : టాటా సన్స్ (Tata Sons) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ (N Chandrasekaran) పునర్నియామకం నేపథ్యంలో చెలరేగిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా ఒక్క వ్యాపారవేత్త కూడా దీనిపై మాట్లాడడానికి సాహసించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు భారతీయ వ్యాపార రంగాన్ని తమ ఆటవస్తువుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు.
"టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు. ఏ వ్యాపార వేత్త కూడా దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం చేయడం లేదు. మీరు ఇంకెంతకాలం ఇలా మౌనంగా ఉంటారు..? మిమ్మల్ని వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకునేంత వరకా..? భారతీయ వ్యాపార రంగం మోదీ, షాల ఆటవస్తువు కాదు. మీకు ఏమాత్రం ధైర్యం లేదు. కానీ మాకు ఉంది. ఈ నేరాలకు సంబంధించి మేము తప్పకుండా న్యాయం చేస్తాము" అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
టాటా గ్రూప్‌లో కీలక పదవి చుట్టూ వివాదం మరింత ముదిరింది. సెప్టెంబర్ 17న నిర్వహించిన బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియామకాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా (Tata Trusts chairman Noel Tata) మరోసారి సవాల్ చేశారు. పునర్నియామకం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీవీఎస్ మోటార్‌తో చంద్రశేఖరన్ కుటుంబానికి చెందిన సంస్థకు ఉన్న వ్యాపార సంబంధాల గురించి బోర్డుకు ముందే సమాచారం ఇచ్చారా..? అని నోయెల్ ప్రశ్నించారు. ఈ అంశాలపై వివరణ ఇవ్వడంతోపాటు కీలక పత్రాలను ఏడు రోజుల్లోగా అందించాలని కోరుతూ టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ సుప్రకాష్ ముఖోపాధ్యాయకు ఎనిమిది పేజీల లేఖ రాశారు. ఈ వివాదం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం
- ●Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
- ●IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు
- ●Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..
- ●Indian Railways | రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
- ●Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు

Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..






