త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌‌కు అమెరికా చట్టసభ సలాం

గాల్లో విమానాన్ని కూల్చేందుకు కో పైలట్ గొడ్డలితో దాడి చేసినా వెరవక 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు యూఎస్ కాంగ్రెస్ నీరాజనం పలికింది.

J

International | Published On Oct 6, 2026, 9.53 pm IST

Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌‌కు అమెరికా చట్టసభ సలాం

సంక్షిప్త సారాంశం

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన దాడిని తిప్పికొట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం తెలిపింది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జోష్ గోథైమర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కెప్టెన్ స్మిత్, సిబ్బందిని ప్రశంసిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విమానం గాల్లో ఉండగా కో పైలట్ ఎమర్జెన్సీ క్రాష్ గొడ్డలితో కెప్టెన్‌పై దాడి చేసి కంట్రోల్స్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. కేవలం 30 సెకన్లలోనే 14,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోతున్న విమానాన్ని కెప్టెన్ అదుపులోకి తెచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారు.

Advertisement

Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్ : నడి ఆకాశంలో ఫ్లైదుబాయ్ విమానంపై జరిగిన భయానక ఉగ్రవాద దాడి కుట్రను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smit Machchhar) అసమాన ధైర్యసాహసాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. విమానంలో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఆయనను, సిబ్బందిని గౌరవిస్తూ అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives) లో చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు జోష్ గోథైమర్ (Josh Gottheimer) ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక తీర్మానం.. విమానంపై జరిగిన ఉగ్రదాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు భారత కెప్టెన్ సమయస్ఫూర్తిని ప్రశంసించింది.

Also Read | యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు

మిడ్‌-ఎయిర్‌లో అసలేం జరిగింది?

గత సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1073 దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ (బెన్ గురియన్ విమానాశ్రయం) బయలుదేరింది. ఆ సమయంలో ఫ్లైట్‌లో నలుగురు అమెరికన్ పౌరులు, 27 మంది చిన్నారులు సహా సుమారు 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రయాణికులు ఇజ్రాయెల్ దేశీయులే.

విమానం ఆకాశంలో దూసుకుపోతున్న తరుణంలో, ఫ్లైట్ డెక్‌లో ఉన్న ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్) ఉన్నట్టుండి తీవ్రవాద ధోరణితో రెచ్చిపోయాడు. విమానంలోని ఎమర్జెన్సీ క్రాష్ యాక్స్ (గొడ్డలి) తీసుకొని కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం విమాన కంట్రోల్స్‌ను తన చేతుల్లోకి తీసుకుని కూల్చివేసేందుకు యత్నించాడు.

ఇదీ చదవండి | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

30 సెకన్లలో 14,000 అడుగులు డౌన్

ఈ పెనుగులాటలో విమానం ఒక్కసారిగా గాల్లో నియంత్రణ కోల్పోయి, కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఏకంగా 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి వేగంగా కిందకు పడిపోయింది. విమానంలో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నప్పటికీ.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. తనపై దాడి జరుగుతున్నా తీవ్రంగా ప్రతిఘటించి, విమాన సిబ్బంది, ప్రయాణికుల సహకారంతో నిందితుడిని నిలువరించారు. అనంతరం చాకచక్యంగా కాక్‌పిట్ కంట్రోల్స్‌ను తిరిగి అదుపులోకి తెచ్చి సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.

Also Read | ఉగ్ర‌వాద భావ‌జాలం.. విమానాలు న‌డ‌ప‌డంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైల‌ట్ గురించి సంచ‌ల‌న విష‌యాలు

అమెరికా చట్టసభ నీరాజనం

పెను విమాన దుర్ఘటనను, ఉగ్రదాడిని తప్పించి అమాయక ప్రజల ప్రాణాలు నిలిపిన కెప్టెన్ స్మిత్ మచ్చర్, క్యాబిన్ క్రూ ప్రదర్శించిన తెగువను అమెరికా ప్రతినిధుల సభ తీర్మానంలో కొనియాడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారత పైలట్ ప్రదర్శించిన సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియ‌న్ పైల‌ట్‌పై ఇజ్రాయెల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

Advertisement

తాజావార్తలు

Advertisement