త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీల‌క ప్ర‌తిపాద‌న‌

Rahul Gandhi | న‌వంబ‌ర్ 1న‌ ఇండీ కూట‌మి ర్యాలీపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ వ్యాపారుల సంఘం (Delhi Trade Body) ఒక స‌రికొత్త ప్ర‌తిపాద‌న చేసింది. ర్యాలీ వ‌ల్ల మ‌రింత మంది క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చి, వ్యాపారం పెరుగుతుంద‌ని రాహుల్ గాంధీ త‌మ‌కు హామీ ఇవ్వాల‌ని తెలిపింది. అలా ఇస్తే ఈ ర్యాలీని తాము స్వాగ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Oct 28, 2026, 12.31 pm IST

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీల‌క ప్ర‌తిపాద‌న‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : న‌వంబ‌ర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదాన్ (Ramlila Maidan)లో ఇండీ కూట‌మి నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మెగా ర్యాలీపై వ్యాపారులు (Delhi Trade Body) తీవ్ర అభ్యంత‌రం తెలుపుతున్నారు. దీపావ‌ళి పండుగ ముందు ఈ ర్యాలీ కార‌ణంగా త‌మ వ్యాపారం తీవ్రంగా దెబ్బ‌తింటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు రూ.10,000 కోట్ల‌కుపైగా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ర్యాలీని దీపావ‌ళి పండుగ త‌ర్వాత తేదీకి వాయిదా వేసుకోవాల‌ని కోరుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Chamber of Trade and Industry) రెండుసార్లు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. అయితే, వారి విజ్ఞ‌ప్తిని రాహుల్ నిరాక‌రించారు.

వ్యాపారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయండి

ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీ వ్యాపారుల సంఘం ఒక స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌తో ముందుకు వ‌చ్చింది. ఈ ర్యాలీ వ‌ల్ల మ‌రింత మంది క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చి, వ్యాపారం పెరుగుతుంద‌ని రాహుల్ గాంధీ త‌మ‌కు హామీ ఇవ్వాల‌ని తెలిపింది. అలా ఇస్తే ఈ ర్యాలీని తాము స్వాగ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, రామ్‌లీలా మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 20 ప్రధాన మార్కెట్ల తరఫున 20 మంది ప్రతినిధులతో కేవలం 20 నిమిషాల పాటు సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్‌ని కోరింది.

"ర్యాలీ జ‌రిగే వేదిక రామ్‌లీలా మైదాన్ నుంచి ఐదు కిలోమీట‌ర్ల పరిధిలో ఉన్న 20 ప్ర‌ధాన మార్కెట్ల ప్ర‌తినిధుల‌తో 20 నిమిషాల పాటూ స‌మావేశం ఏర్పాటు చేయండి. దాదాపు 10 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యే ఈ మ‌హా ర్యాలీ వ‌ల్ల మా వ్యాపారం ఎలా పెరుగుతుంది..? క‌స్ట‌మ‌ర్లు ఎలా వ‌స్తారో..? రాహుల్ గాంధీ 20 నిమిషాల్లో వివ‌రించాలి. ఈ ర్యాలీ వ‌ల్ల మా వ్యాపారానికి న‌ష్టం వాటిల్ల‌ద‌ని పూర్తి హామీ ఇవ్వాలి. అప్పుడు మేము కూడా ర్యాలీకి స్వాగ‌తం ప‌లుకుతాం. లేదంటే దీపావ‌ళి వ‌ర‌కూ ర్యాలీని వాయిదా వేసుకోండి" అని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) చైర్మన్ బ్రిజేష్ గోయల్ కాంగ్రెస్ నేతకు లేఖ రాశారు.

Also Read..

రైళ్ల‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

రాష్ట్రంలో 12 మంది సీనియ‌ర్ ఐఏఎస్‌లు బ‌దిలీ.. దానకిశోర్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు

రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

Advertisement
Advertisement