త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియ‌ర్ ఐఏఎస్‌లు బ‌దిలీ.. దానకిశోర్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియ‌ర్‌ ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Transfers) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అట‌వీశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ జయేష్ రంజన్‌కు (Jayesh Ranjan) ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ శాఖ బాధ్యతలు అప్పగించింది.

G

Telangana | Published On Oct 28, 2026, 12.23 pm IST

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియ‌ర్ ఐఏఎస్‌లు బ‌దిలీ.. దానకిశోర్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు
Advertisement

IAS Transfers | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో 12 మంది సీనియ‌ర్‌ ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Transfers) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అట‌వీశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ జయేష్ రంజన్‌కు (Jayesh Ranjan) ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ శాఖ బాధ్యతలు అప్పగించింది. వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ కొన‌సాగిన‌ నవీన్ మిట్టల్‌కు రెవెన్యూ, ఆర్‌అండ్‌ఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌ఎస్‌ఏడీ శాఖల బాధ్యతలు అప్పగించింది. శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా పోస్టింగ్ ఇచ్చింది.

క్రీడాశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ఎ.వాణీ ప్రసాద్‌ను ప్ర‌సాద్‌ను బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం.. హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మ‌రో సీనియ‌ర్ అధికారి అయిన‌ రాహుల్ బొజ్జాకు గిరిజ‌న సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అద‌న‌పు బాధ్యతలు అప్ప‌గించింది. రవాణా, రోడ్లు, భ‌వ‌నాల శాఖ ముఖ్య‌ కార్యదర్శిగా ఇలంబార్తికి పోస్టింగ్ ఇచ్చింది.

ప్ర‌స్తుతం హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు.. మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి సంస్థల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. శృతి ఓజాకు మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల‌ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ముషార‌ఫ్ అలీ ఫారూఖీని వైద్య‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణకు డ‌బ్ల్యూసీడీ అండ్ ఎస్సీ శాఖ డైరెక్టర్‌గా, జితేష్ వీ. పాటిల్‌కు టీజీఆర్‌ఈడీసీఓ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ప‌ద‌వీకాలం పొడిగింపు..

మ‌రోవైపు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ప్ర‌స్తుతం గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దానకిశోర్‌ (Dana Kishore) పదవీకాలాన్ని పొడిగించింది. ఆయ‌న ప‌ద‌వీకాలం ఈ నెలాఖ‌రుతో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఎక్స్‌టెన్స‌న్ ఇచ్చింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు ఆయ‌న ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని పేర్కొంది. మ‌రోవైపు ఎంఏయూడీ స్పెష‌ల్ సీఎస్‌గా ఉన్న జ‌యేశ్ రంజ‌న్ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మ‌రో 11 నెల‌ల ప‌దవీకాలం ఉండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement