Gold Prices | బంగారం కొనుగోళ్లను తగ్గించిన వ్యాపారులు.. ధరలు పతనమవుతాయా..?
Gold Prices | బంగారం ధరలు మరింత తగ్గుతాయనే అంచనాలతో దేశంలోని ప్రముఖ నగల వ్యాపారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. దీపావళి, ధంతేరస్ వంటి పండుగలతో బంగారానికి డిమాండ్ పెరగాల్సిన సమయంలో కొనుగోళ్లు మందగించడం మార్కెట్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు సుమారు 24 శాతం తగ్గాయి.
Gold Prices | బంగారం ధరలు మరింత తగ్గుతాయనే అంచనాలతో దేశంలోని ప్రముఖ నగల వ్యాపారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. దీపావళి, ధంతేరస్ వంటి పండుగలతో బంగారానికి డిమాండ్ పెరగాల్సిన సమయంలో కొనుగోళ్లు మందగించడం మార్కెట్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు సుమారు 24 శాతం తగ్గాయి. దిగుమతి సుంకాల పెంపు, గ్రామీణ డిమాండ్ బలహీనత కూడా భారత బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
పెద్ద వ్యాపార సంస్థల విముఖత..
భారత్‌లో అతిపెద్ద విలువైన లోహాల శుద్ధి సంస్థల్లో ఒకటైన ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ గుహా వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణంగా బంగారం అమ్మకాల్లో అధిక వాటా కలిగిన పెద్ద నగల సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు తిరిగి రాలేదు. ప్రస్తుతం చిన్న, మధ్యస్థాయి నగల వ్యాపారులు మాత్రమే కొంత చురుగ్గా కొనుగోళ్లు చేస్తున్నారు. వారిలో కొందరు మళ్లీ మళ్లీ ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. గత వారం బంగారం ధర ఔన్సుకు 4వేల డాలర్ల దిగువకు పడిపోయింది. జూలై తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. జనవరిలో ఔన్సుకు 5,400 డాలర్లకు పైగా రికార్డు స్థాయిని తాకిన ధరలు, ఫిబ్రవరి చివర్లో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 24 శాతం క్షీణించాయి. ధరలు పెరుగుతాయని భావించినప్పుడు పెద్ద నగల సంస్థలు భవిష్యత్తులో అధిక ధరలు చెల్లించకుండా ముందుగానే బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ధరలు ఇంకా తగ్గుతాయని అంచనా వేస్తే మాత్రం నిల్వలను తగ్గించుకుంటాయని గుహా వివరించారు.
కారణాలేమిటి..?
ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారైన భారత్‌లో ఈ ఏడాది డిమాండ్ మందకొడిగా కొనసాగుతోంది. మే నెలలో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని రెట్టింపుకంటే ఎక్కువగా పెంచి 15 శాతానికి చేర్చింది. పెరుగుతున్న వాణిజ్య లోటును నియంత్రించేందుకు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పలుమార్లు ప్రజలకు సూచించారు. భారత్ తన అవసరాలకు దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. పెరిగిన సుంకాల కారణంగా కొంతమంది కొనుగోలుదారులు అధికారిక మార్కెట్‌కు బదులుగా నగదు లావాదేవీలు జరిగే అనధికార మార్కెట్ల వైపు మళ్లుతున్నారని గుహా తెలిపారు. దీనికి భిన్నంగా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారైన చైనాలో ధరలు తగ్గడంతో ఇటీవల గృహ వినియోగదారుల కొనుగోళ్లు పెరిగాయి. భారత్‌లో మాత్రం నవంబర్ 8న జరగనున్న దీపావళి సహా అక్టోబర్-డిసెంబర్ మధ్య అత్యధికంగా ఉండే పండుగల కొనుగోళ్ల సీజన్‌లోనూ డిమాండ్ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
బంగారం ధరలు పెరుగుతాయా..?
సిటీ రీసెర్చ్ అంచనాల ప్రకారం కఠినమైన దిగుమతి నిబంధనలు, ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాల అంతరాయాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనపడిన డిమాండ్ భారత బంగారం దిగుమతులను తగ్గించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దిగుమతులు సుమారు 106 టన్నులకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది సాధారణంగా నాలుగో త్రైమాసికంలో నమోదయ్యే 212 టన్నుల సగటులో సగం మాత్రమేనని అంచనా వేసింది. ఎంఎంటీసీ-పీఏఎంపీ బంగారం అమ్మకాలు గతేడాది స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయని, వినియోగదారులు పెద్ద పరిమాణంలోని బంగారం కంటే చిన్న నాణేలు, బార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని గుహా తెలిపారు. సెప్టెంబర్‌లో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉండగా, అక్టోబర్‌లో కొనుగోళ్లు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభిస్తే కొనుగోళ్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
అక్టోబర్ 28, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
అక్టోబర్ 27, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం
- ●Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
- ●IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు
- ●Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..
- ●Indian Railways | రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
- ●Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు

Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..



