Ponnam Prabhakar | చరిత్రలో నిలిచిపోయేలా.. భవిష్యత్ తరాలకు అందించేలా ఉస్మానియా దవాఖాన నిర్మాణం: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాబోయే 100 ఏండ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ఆధునిక ప్రమాణాలతో దవాఖానను నిర్మిస్తున్నామని చెప్పారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాబోయే 100 ఏండ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ఆధునిక ప్రమాణాలతో దవాఖానను నిర్మిస్తున్నామని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హుసేన్, కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా దవాఖాన పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఎన్నో ఏండ్లుగా వైద్య సేవలందించిన ఉస్మానియా దవాఖానను (Osmania Hospital) మరింత ఉన్నతంగా పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు దాదాపు రూ.2,700 కోట్ల వ్యయంతో, 2 వేల పడకల సామర్థ్యంతో, సుమారు 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చరిత్రలో నిలిచిపోయేలా నూతన భవన నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఇందులో 2 వేల పడకల హాస్పిటల్‌తోపాటు విద్యార్థి, విద్యార్థినులకు వేర్వేరు హాస్టళ్లు, ధర్మశాల, అడ్మినిస్ట్రేటివ్ భవనం, గ్రీనరీ, అత్యాధునిక వెంటిలేషన్ వంటి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే పుట్టింగ్ పనులు పూర్తయ్యాయని, రెండు అంతస్తుల స్లాబుల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. పనుల వేగాన్ని పరిశీలించేందుకు అధికారులతో కలిసి ప్రతినెలా పర్యవేక్షణ చేస్తామన్నారు. స్థల సేకరణ, రోడ్డు కనెక్టివిటీ, పక్కనున్న హాస్టల్ హెరిటేజ్ సంబంధిత లీగల్ అంశాల వంటి చిన్నపాటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. హాస్పిటల్ ప్రాజెక్టులో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) ఏర్పాటుతో పాటు వర్షపు నీటి సంరక్షణ (వాటర్ హార్వెస్టింగ్) ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సంబంధిత వార్తలు

Rahul Gandhi | టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ
అక్టోబర్ 28, 2026

Gold Prices | బంగారం కొనుగోళ్లను తగ్గించిన వ్యాపారులు.. ధరలు పతనమవుతాయా..?
అక్టోబర్ 28, 2026

Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం
- ●Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
- ●IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు
- ●Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..
- ●Indian Railways | రైళ్లలో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
- ●Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

Congress | సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం

Rahul Gandhi | 20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన

IAS Transfers | రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ.. దానకిశోర్ పదవీకాలం పొడగింపు

Truecaller Lite | ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం.. ట్రూకాలర్ కొత్త యాప్.. 10ఎంబీ ఉన్నా చాలు..



