త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pulitzer Prize | ఇద్ద‌రు భార‌తీయ జ‌ర్న‌లిస్టుల‌ను వ‌రించిన పులిట్జ‌ర్‌

Pulitzer Prize | పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ పురస్కారం (Pulitzer Prize) ఇద్దరు భారతీయ జర్నలిస్టులను (Indian journalists) వరించింది.

D

National | Published On May 5, 2026, 4.15 pm IST

Pulitzer Prize | ఇద్ద‌రు భార‌తీయ జ‌ర్న‌లిస్టుల‌ను వ‌రించిన పులిట్జ‌ర్‌
Advertisement

Pulitzer Prize | పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ పురస్కారం (Pulitzer Prize) ఇద్దరు భారతీయ జర్నలిస్టులను (Indian journalists) వరించింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల (cyber fraud) వెనుక ఉన్న వ్యవహారాలను లోతుగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మ ఈ అవార్డును దక్కించుకున్నారు.

న్యూయార్క్‌లో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పులిట్జ‌ర్ ప్రైజ్ విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. ఇలుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంట‌రీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే క‌థ‌నం కోసం ఆ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి ప్రముఖ మీడియా సంస్థకు చెందిన నటాలీ ఒబికో పియర్సన్ కూడా ప‌నిచేశారు. దీంతో ఈ అవార్డును ముగ్గురూ పంచుకోనున్నారు. ద‌క్షిణాసియాలో సైబ‌ర్ నేర‌గాళ్ల ముఠా ఎలా ప‌నిచేస్తుంద‌న్న కోణంలో ట్రాప్డ్ క‌థ‌నంలో చూపించారు.

21 రంగాల్లో ఎంపిక

పులిట్జ‌ర్ పుర‌స్కారాన్ని.. పాత్రికేయ, సాహిత్య రంగాలలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు. ఈ ప్రైజ్‌ను మీడియాతోపాటు మొత్తం 21 రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఏటా ఇస్తారు. జోసెఫ్ పులిట్జర్ జ్ఞాపకార్థం 1917 నుంచి ఈ ప్రైజ్‌ను ఇస్తున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ (Columbia University) దీనిని ప్రదానం చేస్తుంది. జర్నలిజం (15 విభాగాలు), సాహిత్యం, డ్రామా, సంగీతం, ఫోటోగ్రఫీ వంటి 21 విభాగాలు ఉన్నాయి. విజేతలకు దీనికింద 15 వేల డాలర్లు, ఒక సర్టిఫికేట్‌ ఇస్తారు. ప్రజాసేవ విభాగంలో పురస్కారం లభించిన వ్యక్తికి మాత్రం బంగారుపతకం ఇస్తారు.

Also Read..

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. ప్ర‌యాణీకుల‌కు ఇండిగో అడ్వైజ‌రీ..!

బ్యాంకింగ్ రంగంలో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

రూ.142 కోట్ల డైమండ్ నెక్లెస్‌తో.. మెట్‌గాలాలో మెరిసిన హైద‌రాబాద్ బిలియ‌నీర్

Advertisement
Advertisement