త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | బ్యాంకింగ్ రంగంలో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి చెందిన సంస్థ‌ల్లో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణకు ఆస‌క్తి చూపించారు. దీంతో మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌య్యాయి. సెన్సెక్స్ 251.61 పాయింట్లు (0.33 శాతం) త‌గ్గి 77,017.79 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 86.50 పాయింట్లు (0.36 శాతం) ప‌తన‌మై 24,032.80 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

S

Business | Published On May 5, 2026, 4.08 pm IST

Stock Markets | బ్యాంకింగ్ రంగంలో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి చెందిన సంస్థ‌ల్లో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణకు ఆస‌క్తి చూపించారు. దీంతో మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌య్యాయి. సెన్సెక్స్ 251.61 పాయింట్లు (0.33 శాతం) త‌గ్గి 77,017.79 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 86.50 పాయింట్లు (0.36 శాతం) ప‌తన‌మై 24,032.80 వ‌ద్ద స్థిర‌ప‌డింది. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు బెంచ్ మార్క్‌ల‌ను మించి ప్ర‌ద‌ర్శ‌న చేశాయి. ఆయా సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ 150 మిడ్ క్యాప్ 0.15 శాతం లభ‌ప‌డ‌గా, బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ సూచీ 0.20 శాతం లాభ‌ప‌డింది. విస్తృత మార్కెట్ల‌లో లాభాల కార‌ణంగా బీఎస్ఈలో న‌మోదైన సంస్థ‌ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేష‌న్ రూ.467 ల‌క్ష‌ల కోట్ల వద్ధ స్థిరంగా ఉంది.

బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ స్టాక్స్‌లో..

బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ స్టాక్‌లలో అమ్మ‌కాల కార‌ణంగా బెంచ్ మార్క్ సూచీలు ప‌త‌న‌మ‌య్యాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్‌లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఆయా బ్యాంకుల స్టాక్స్ బెంచ్ మార్క్ సూచీల ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 0.60 శాతం క్షీణించ‌గా, ప్రైవేటు బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు వ‌రుస‌గా 0.67, 0.20 శాతం చొప్పున ప‌త‌న‌మ‌య్యాయి. అయితే ప్ర‌పంచ మార్కెట్ల నుంచి బ‌ల‌హీన‌మైన సంకేతాలు వ‌స్తుండ‌డం, అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య మ‌ళ్లీ పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా పెట్టుబ‌డిదారులు ఒత్తిడికి గురయ్యారు. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, భార‌త రూపాయి విలువ ప‌త‌నం అవ‌డం వంటివి కూడా మార్కెట్ల ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణాలుగా నిలిచాయి.

త‌గ్గిన ఆశావ‌హ దృక్ప‌థం..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయ‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల అనంత‌రం పెట్టుబ‌డిదారుల్లో ఆశావాహ దృక్ప‌థం స‌న్న‌గిల్లింద‌న్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌ల న‌డుమ ప్ర‌పంచ మార్కెట్లు సైతం నెగెటివ్ సంకేతాల‌ను ఇస్తున్నాయ‌ని, సెంటిమెంట్ క్షీణించింద‌ని అన్నారు. దేశీయ ఈక్విటీలు తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు. పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి విలువ‌, విదేశీ సంస్థాగత పెట్టుబ‌డిదారుల నిధుల ఉప సంహ‌ర‌ణ వంటి అంశాలు కూడా మార్కెట్ల దిశ‌ను ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని, పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు.

భారీగా ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

కాగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.89 శాతం మేర త‌గ్గి 112 డాల‌ర్ల‌కు పైన ఉండ‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.79 శాతం త‌గ్గి 101 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరిడా డాల‌ర్‌కు భార‌త రూపాయి మార‌కం విలువ 21 పైస‌ల మేర ప‌త‌న‌మై 95.28 వ‌ద్ద నిలిచింది. అయితే రూపాయి విలువ ప‌త‌న‌మ‌వుతుండ‌డం భార‌త ఈక్విటీ మార్కెట్ల‌కు ఎదురుదెబ్బ అవుతుంద‌ని, రూపాయి బ‌ల‌ప‌డితేనే విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement