త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Asia | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. ప్ర‌యాణీకుల‌కు ఇండిగో అడ్వైజ‌రీ..!

West Asia | పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు అడ్వైజ‌రీని జారీ చేసింది. అక్కడి పరిస్థితుల కారణంగా విమానాల షెడ్యూల్‌లో మార్పులు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని ఎయిర్స్‌లైన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

P

International | Published On May 5, 2026, 4.06 pm IST

West Asia | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. ప్ర‌యాణీకుల‌కు ఇండిగో అడ్వైజ‌రీ..!
Advertisement

West Asia | పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు అడ్వైజ‌రీని జారీ చేసింది. అక్కడి పరిస్థితుల కారణంగా విమానాల షెడ్యూల్‌లో మార్పులు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని ఎయిర్స్‌లైన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ ఫ్ల‌యిట్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవాల‌ని సూచించింది. టిక్కెట్లు బుక్ స‌మ‌యంలో అందించిన వివ‌రాల‌ను ఉప‌యోగించుకొని ప్ర‌యాణికుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని అందిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఏ ప్రయాణికుడికైనా ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, సహాయం అవసరమైనా తమ బృందం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సు తమకు అత్యంత ప్రాధాన్యత అని ఆ సంస్థ స్పష్టం చేసింది. సురక్షితమైన విమాన కార్యకలాపాలను నిర్ధారించడానికి ఇండిగో సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

Advertisement
Advertisement