Met Gala | రూ.142 కోట్ల డైమండ్ నెక్లెస్‌తో.. మెట్‌గాలాలో మెరిసిన హైదరాబాద్ బిలియనీర్
Met Gala | అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా (Met Gala)లో హైదరాబాద్‌కు చెందిన బిలియనీర్ మేఘా సుధా రెడ్డి (Megha Sudha Reddy) మెరిశారు. రూ.142 కోట్ల నెక్లెస్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈవెంట్‌లో సుధా రెడ్డి రాయల్ లుక్ చూసి అక్కడివారు ఫిదా అయ్యారు.
Met Gala | న్యూయార్క్‌లో జరుగుతున్న అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా (Met Gala)లో హైదరాబాద్‌కు చెందిన బిలియనీర్ మేఘా సుధా రెడ్డి (Megha Sudha Reddy) మెరిశారు. దక్షిణ భారత వారసత్వాన్ని, కళాత్మకతను ప్రతిబింబించేలా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేక గౌనులో మెరిశారు. ఈవెంట్‌లో భాగంగా ఆమె ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫ్యాషన్ ఈవెంట్‌లో సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ ఈ వేడుకకే హైలెట్‌గా నిలిచింది. దీని ధర అక్షరాల రూ.142 కోట్లు అని (Rs 142 Crore Necklace) తెలిసింది. ఇందులో 550 క్యారెట్ల అరుదైన డీప్ వయొలెట్-బ్లూ టాంజానైట్ స్టోన్‌ను ఉపయోగించారట. ఈ నెక్లెస్‌ను 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారు. దీనికి తోడు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల అషర్-కట్ కొలంబియన్ ఎమరాల్డ్ (పచ్చ)తో తన రాయల్ లుక్‌ను పూర్తి చేశారు.
ఇక ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ థీమ్‌లో భాగంగా సుధా రెడ్డి రాజసం ఉట్టిపడేలా 'రాయల్ బ్లూ' వెల్వెట్ గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ గౌను వెనుక గొప్ప కళాకృతి దాగిఉంది. మచిలీపట్నం కలంకారీ శైలిలో రూపొందించిన 'ట్రీ ఆఫ్ లైఫ్' (జీవ వృక్షం) ఇతివృత్తంతో ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర తీర్చిదిద్దారు. జెన్నిఫర్ లోపెజ్ స్టైలిస్ట్ అయిన మారియల్ హేన్ దీనికి స్టైలింగ్ చేశారు. ఏడు మీటర్ల పొడవైన ట్రైన్‌తో ఉన్న ఈ గౌనుపై నెమలి డిజైన్లు, గోల్డ్ జర్దోసీ వర్క్ అద్భుతంగా ఉన్నాయి. 90 మంది కళాకారులు సుమారు 3,400 గంటల పాటు శ్రమించి ఈ గౌనును తీర్చిదిద్దారు. ఆమె లుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read..
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. యూరియా అమ్మకాలపై నిషేధమెందుకు?: హరీశ్‌రావు
డీకే శివకుమార్ సీఎం అయ్యేనా..? ఢిల్లీ నుంచి పిలుపు వస్తే వెళ్తానన్న సిద్ధారామయ్య..!
సాయిపల్లవి కారణంగా ప్రభాస్ కల్కి 2 షూటింగ్ క్యాన్సిల్ - అసలేమైందంటే?
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





