Emirates Flights Return To Kerala | రణరంగంగా పశ్చిమాసియా.. వెనక్కి తిరిగొచ్చిన విమానాలు
Emirates Flights Return To Kerala | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (West Asia Conflict) తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌కు చెందిన కీలక స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ విరుచుకుపడుతోంది.
Emirates Flights Return To Kerala | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (West Asia Conflict) తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌కు చెందిన కీలక స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. టెహ్రాన్ ప్రయోగించిన ఓ డ్రోన్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. ఫలితంగా భారత్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన రెండు ఎమిరేట్స్ విమానాలు వెనక్కి (Emirates Flights Return To Kerala) తిరిగొచ్చాయి.
353 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఎమిరేట్స్ విమానం ఒకటి ఇవాళ తెల్లవారుజామున 4:40 గంటలకు తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కి బయల్దేరి వెళ్లింది. అయితే, అప్పటికే అక్కడ డ్రోన్ అటాక్ కారణంగా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ఫలితంగా ఆ విమానం వెనక్కి తిరిగివచ్చేసింది. ఇవాళ ఉదయం 8:40 గంటలకు తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులందరినీ టెర్మినల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెల్లవారుజామున 4.30 గంటలకు 325 మందితో ఎమిరేట్స్‌కు చెందిన EK533 విమానం కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కి బయల్దేరి వెళ్లింది. అది కూడా వెనక్కి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు విమానం కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.
దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత..
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు (Drone Strike) జరిగాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Dubai Airport) సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్‌ను (fuel tank) తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిచిపోయాయి (Flights Suspended). విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. దుబాయ్‌కి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులు తమ విమాన స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల భద్రతను పెంచారు. ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద కూడా భద్రత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Chabahar Trade Zone | ఇరాన్‌లోని భారత్‌కు వ్యూహాత్మక ఓడరేవు చాబహార్‌పై యూఎస్ దాడి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు.. ప్రైవసీ లేనట్లే..
సంబంధిత వార్తలు

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026

Southwest Monsoon | వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
మే 15, 2026

Sanjay Malhotra | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక హెచ్చరికలు
మే 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



