Chabahar Trade Zone | ఇరాన్‌లోని భారత్‌కు వ్యూహాత్మక ఓడరేవు చాబహార్‌పై యూఎస్ దాడి
Chabahar Trade Zone | ఇరాన్ (Iran)పై అమెరికా దాడులను పెంచింది. గత వారం ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై బాంబుల వర్షం కురిపించిన యూఎస్.. ఇప్పుడు ఇరాన్‌లోని కీలక వాణిజ్య ప్రాంతం చాబహార్ ఫ్రీ ట్రేడ్-ఇండస్ట్రియల్ జోన్ (Chabahar Trade Zone) సమీపంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది.
International | Published On Mar 16, 2026, 1.59 pm IST
Chabahar Trade Zone | ఇరాన్ (Iran)పై అమెరికా దాడులను పెంచింది. గత వారం ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై బాంబుల వర్షం కురిపించిన యూఎస్.. ఇప్పుడు ఇరాన్‌లోని కీలక వాణిజ్య ప్రాంతం చాబహార్ ఫ్రీ ట్రేడ్-ఇండస్ట్రియల్ జోన్ (Chabahar Trade Zone) సమీపంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. చాబహార్ పోర్టుపై యుద్ధ విమానాలతో దాడి చేసింది. అక్కడి మిలిటరీ స్థావరాలపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. యూఎస్ దాడితో సీఎఫ్‌జెడ్ (CFZ) జోన్ ప్రాంతం వెనుక ఉన్న పర్వతం నుంచి భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వాయిస్ ఆఫ్ అమెరికా పర్షియన్ లాంగ్వేజ్ సర్వీస్ పేర్కొంది. అయితే, ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
హర్మూజ్‌కు ప్రత్యామ్నాయం..
ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి 1992లో ఈ చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇది మధ్య ఆసియాను హిందూ మహాసముద్రంతో కలిపే ఓ వ్యూహాత్మక, పన్ను రహిత కేంద్రంగా ఉంది. ఇది ఇరాన్‌కు సముద్ర రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంతేకాదు, ఒమన్ గల్ఫ్ తీరంలో ఉన్న ఈ జోన్.. ఇరాన్ హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం కూడా. ఈ జలసంధి గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించొచ్చు.
భారత్‌కు వ్యూహాత్మక ఓడరేవు..
చాబహార్ ఓడరేవు భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. ఈ జోన్‌లో పెట్టుబడులు పెట్టే వారికి 20 ఏళ్లపాటూ పన్ను మినహాయింపు కల్పిస్తారు. కరెన్సీ మార్పిడిలోనూనూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. చాబహార్‌లోని షాహిద్ బెహెస్టి టెర్మినల్‌ను ఇండియన్ పోర్ట్స్‌గ్లోబల్ లిమిటెడ్ (India Ports Global Ltd) నిర్వహించేందుకు, స్వల్పకాలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత్ 2024 మేలో ఇరాన్‌తో పది సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్‌లో దాదాపు 370 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
భారత్ తన ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే విదేశీ పెట్టుబడులు, స్థిరమైన వాణిజ్య మార్గాలు ఎంతో అవసరం. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సవాళ్ల నేపథ్యంలో భారత భౌగోళిక, ఆర్థిక వ్యూహాలకు ఈ చాబహార్ ఓ మూలస్తంభం వంటిదని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌కు ఈ ఓడరేవు కేవలం ఓ వ్యాపార కేంద్రం మాత్రమే కాదు.. హిందూ మహాసముద్రం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలను చేరుకునేందుకు కీలక మార్గం కూడా. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఇతర దేశాలతో వాణిజ్యం జరపడానికి ఈ మార్గం చాలా కీలకంగా ఉంటుంది. ఆఫ్ఘాన్ ప్రజలకు భారత్ అందించే మానవతా సాయం చేరేందుకు ఈ ఓడరేవు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.
Also Read..
యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిస్సైల్‌ను ప్రయోగించిన ఇరాన్.. దీని ప్రత్యేకతలు ఇవే..
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: రాహుల్ ద్రావిడ్
ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు మెటా నుంచి కొత్తగా ఏఐ డిటెక్షన్ టూల్..
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



