త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samuel | కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్ల‌తో దాడి

Mandula Samuel | బోడుప్ప‌ల్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై బీజేవైఎం నాయ‌కులు కోడిగుడ్ల‌తో దాడి చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 3.02 pm IST

Mandula Samuel | కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కోడిగుడ్ల‌తో దాడి
Advertisement

Mandula Samuel | త్రినేత్ర‌.న్యూస్ : బోడుప్ప‌ల్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై బీజేవైఎం నాయ‌కులు కోడిగుడ్ల‌తో దాడి చేశారు. హిందువులను కించపరిచే విధంగా మందుల సామేల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం నాయకులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజల వద్ద ఓట్లు కోరిన సామేల్ ఇప్పుడు హిందువులను అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు.

మందుల సామ్యూల్ తన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఘటనతో బోడుప్పల్ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొనగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement
Advertisement