త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక‌ ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజ‌కీయాల్లో చూల్లే

Allam Narayana | బెల్టుల‌తోటి కొట్టుడు, లాగుల తొండ‌లు ఇడుసుడు భాష‌ను రాజ‌కీయాల్లో ఇప్ప‌టివ‌ర‌కు చూల్లేద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అల్లం నారాయ‌ణ అన్నారు. ఇది ఓ ముఖ్య‌మంత్రి మాట్లాడే భాష కాదన్నారు. అభివృద్ధి, మార్పు పోయి సాదాసీదా తెలంగాణ క‌నిపిస్తున్న‌ది ఆవేద‌న చెందారు. ఇగ ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు క‌లిసి తెలంగాణను పొర్కపొట్టు చేశార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Aug 8, 2026, 6.39 pm IST

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక‌ ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజ‌కీయాల్లో చూల్లే
Advertisement
  • దిగజారుడు భాషలో రేవంత్ రెడ్డి లాంటి సీఎం మరొకడు లేడు
  • అభివృద్ధి లేదు, మార్పు లేదు.. సాదాసీదా తెలంగాణ కనిపిస్తున్న‌ది
  • ఎన్టీఆర్ ఏం పున్యాత్ముడు కాడు
  • బాబు, ఆయ‌న క‌లిసి తెలంగాణ‌ను పొర్కొపొట్టు చేసిర్రు
  • సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

Allam Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: బెల్టుల‌తోటి కొట్టుడు, లాగుల తొండ‌లు ఇడుసుడు భాష‌ను రాజ‌కీయాల్లో ఇప్ప‌టివ‌ర‌కు చూల్లేద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అల్లం నారాయ‌ణ అన్నారు. ఇది ఓ ముఖ్య‌మంత్రి మాట్లాడే భాష కాదన్నారు. అభివృద్ధి, మార్పు పోయి సాదాసీదా తెలంగాణ క‌నిపిస్తున్న‌ది ఆవేద‌న చెందారు. ఇగ ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు క‌లిసి తెలంగాణను పొర్కపొట్టు చేశార‌ని ఆరోపించారు. హైద‌రాబాద్‌ను అడ్డికి పావుశేరు అమ్మార‌ని విమ‌ర్శించారు. ఈమేర‌కు ఆయ‌న తాజాగా మాట్లాడుతూ రేవంత్ భాష‌పై మండిప‌డ్డారు.

ఇదా మ‌నం కోరుకున్న‌ది?

2014కు ముందు ఏ వాతావ‌ర‌ణం ఉండేనో ఇయ్యాళ అదే వాతావ‌ర‌ణం వ‌చ్చింది. తెలంగాణ పోయింది.. తెలంగాణ గురించి మాట్లాడుడు పోయింది.. అభివృద్ధి పోయింది.. ఎంత‌సేపు అవ్వ‌ల‌క్క‌ల‌ను తిట్టుకోవ‌డంలాంటివే మ‌నం చూస్తున్నం గ‌దా. ఏం భాష అది? ఇంత దిగ‌జారిన భాష రాజ‌కీయాల్లో లేదు. ఈ ముఖ్య‌మంత్రి అయితే మ‌రీ అన్యాయం. బెల్టులతోటి కొట్టుడు, లాగుల తొండ‌లు ఇడుసుడు.. అస‌లు ఒక ముఖ్య‌మంత్రి భాష కాదిది. ఏ అభివృద్ధి కోసం, ఏ మార్పుల కోస‌మైతే తెలంగాణ తెచ్చుకున్న‌మో అది లేదు ఇయ్యాళ‌. సాదాసీదా రాజ‌కీయ తెలంగాణ త‌యారైంది. ఇదా మ‌నం కోరుకున్న‌ది? అస్థిత్వ చిహ్నాలుగా పాటించే వాటికి గూడా అవ‌మానం జ‌రుగుతున్న‌ది. తెలంగాణ తల్లి విగ్ర‌హం దొర‌సాని లెక్కుంద‌ని మార్చిర్రు స‌రే. సెక్రెటేరియ‌ట్ ముంద‌ర వేరే విగ్ర‌హం ఎందుకు మ‌రి? అని అల్లం ప్ర‌శ్నించారు.

హైద‌రాబాద్‌ను అడ్డికి పావుశేరు అమ్మేసిండు..

చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ను అడ్డికి పావుశేరు అమ్మేసిండు. ఉన్న కంపెనీలన్నీ అమ్మేసిండు. చివ‌రిదాకా రెండు కండ్ల సిద్ధాంతమే నమ్మిండు. ఆయ‌న ఒక మెంట‌ల్ కేస్‌లా మాట్లాడుతుండు. ఒక్క హైటెక్ సిటీ క‌ట్టి అభివృద్ధి చేసినా అంట‌డు.. అటువంటివి 36 ఉన్న‌య్ ఇప్పుడు. చంద్ర‌బాబు, ఎన్టీఆర్ క‌లిసి తెలంగాణ‌ను విధ్వంసం చేశారు. ఎన్టీఆర్ ఏం పున్యాత్ముడు కాడు.. ఇయ్యాళ ఆయ‌న విగ్ర‌హాలు పెడుతున్న‌రు. తెలంగాణ‌ను మొత్తం పొర్క‌పొట్టు చేసిండు. మాట్లాడ‌డానికి లేదు.. పాట పాడ‌డానికి లేదు. ఎవ‌రెప్పుడు స‌చ్చ‌పోత‌రో తెల్వ‌దు. మొత్తం నిర్భందాన్ని ప్ర‌యోగించిండు అని అల్లం నారాయ‌ణ ఆరోపించారు.

కేసీఆర్ మీద కొంచెం కోప‌ముండే..

కేసీఆర్ చేసిన ఒక గొప్ప ప‌నిపై ముందు నాకు విమ‌ర్శ‌గా ఉండే. ట్యాంక్‌బండ్ ద‌గ్గ‌ర క‌ట్ట‌డాలు చేయొద్ద‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు చెప్ప‌డంతో ఆ అభిప్రాయం ఉండే నాకు. కానీ ఆయ‌న ఒక అద్భుతాన్ని నిర్మించిండు. హ్యాట్స‌ఫ్‌. అది బాగా ఇష్ట‌మైన ప్లేస్ అయింది ఇప్పుడు. సెక్రెటేరియ‌ట్ కూల‌గొట్టిన‌ప్పుడు కూడా విమ‌ర్శ ఉండే నాకు. అరే ఈన ఎందుకు కూల‌గొడుతున్న‌డు అని. స‌రే క‌ట్టిండు.. బాగుంది. దాని ముంద‌ర అమ‌ర‌వీరుల స్థూపం క‌ట్టిండు. అన్నింటికి మించి ఏ ఆర్టిక‌ల్ ద్వారా అయితే స్వ‌రాష్ట్రాన్ని సాధించ‌డానికి కార‌ణ‌మైండో ఆ అంబేద్క‌ర్ స్మ‌ర‌ణ‌లో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాడు. ఇవాళ ఐకాన్స్ ఈ మూడే. హైద‌రాబాద్ చార్మినార్ ఐకాన్ త‌ర్వాత ఈ మూడే ఐకాన్స్‌గా ఉన్న‌య్ అని అల్లం కొనియాడారు.

Advertisement
Advertisement