Komatireddy Venkat Reddy | సాగు నీరు ఇవ్వలేం.. ప్రజలకు ధైర్యం చెప్పండి
Komatireddy Venkat Reddy | ఈ సూపర్ ఎల్ నినోతో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా కొంచెం వర్షాలు పడే చాన్సుంది. కానీ దక్షిణ తెలంగాణకు అస్సలు వానలు లేవని చెబుతున్నారు. అందుకే.. ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లు వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి కోసం సరిపోతాయి. సాగు పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం నుంచి నీళ్లు వదిలినా అవి సరిపోవు. అందుకే ఈ కష్టకాలంలో అధికారులు..ప్రజలకు ధైర్యం చెప్పాలి అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎప్పుడూ వరి వేస్తూ ఉంటే
నేలలు ఎందుకూ పనికిరావు
నాగార్జున సాగర్ లో ఉన్న నీరు
జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుంది
శ్రీశైలం నుంచి నీళ్లొచ్చినా
పంటలకు వదిలే పరిస్థితి లేదు
సూపర్ ఎల్ నినో వల్ల
ఇక దక్షిణ తెలంగాణకు వానలుండవు
అధికారులతో సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : "ఈ సూపర్ ఎల్ నినోతో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా కొంచెం వర్షాలు పడే చాన్సుంది. కానీ దక్షిణ తెలంగాణకు అస్సలు వానలు లేవని చెబుతున్నారు. అందుకే.. ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లు వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి కోసం సరిపోతాయి. సాగు పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం నుంచి నీళ్లు వదిలినా అవి సరిపోవు. అందుకే ఈ కష్టకాలంలో అధికారులు..ప్రజలకు ధైర్యం చెప్పాలి. ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించండి. వివిధ ప్రాజెక్టుల కింద రైతులు రెండు పంటలు వరి వేస్తున్నారు,దీనివల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోయి ఎందుకు పనికిరాకుండా పోతాయి. విపరీతంగా ఎరువులు వాడి నిరంతరం వరి సాగు చేయటం వల్ల భవిష్యత్ లో ఎలాంటి పంటలు వేసుకోలేని పరిస్థితి వస్తుంది" అని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై.. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
సాగర్ నిండినా చెరువులు నింపలేం
ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుండి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేయకుండా ఆరు తడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు."నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద రైతులు రెండు పంటలు వరి వేస్తున్నారు.దీనివల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోయి ఎందుకు పనికిరాకుండా పోతాయి. విపరీతంగా ఎరువులు వాడి నిరంతరం వరి సాగు చేయటం వల్ల భవిష్యత్ లో ఎలాంటి పంటలు వేసుకోలేని పరిస్థితి వస్తుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. నాగార్జునసాగర్ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదు.ఇప్పటికే బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నందు కష్ట కాలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులకు అండగా నిలబడి ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉంది. శ్రీశైలం నుండి నీరు వచ్చినా.. పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుంది. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్ నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కష్ట కాలంలో రైతులకు అండగా ఉండాలి. ప్రజలకు ధైర్యం చెప్పాలి" అని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
దక్షిణ తెలంగాణకు వర్షాలు లేవు
సూపర్ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. "వర్షాలు లేనందున ప్రాజెక్టుల్లో కూడా సరైనంత నీరు లేదు. రానున్న రోజుల్లో పై నుండి సాగునీరు వచ్చే అవకాశాలు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో రైతులు వేసుకోబోయే పంటలు, తాగునీరు, ఇతర సౌకర్యాలపై చర్చించి ప్రణాళిక రూపొందించుకోవాలి. సెప్టెంబర్ లో కూడా సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుంది. ఉత్తర తెలంగాణకు మాత్రమే అక్కడక్కడ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కానీ దక్షిణ తెలంగాకు వర్షాలు ఉండకపోవచ్చు" అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచనలు..!
- ●PhonePe | ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులు ఉచితమే..
- ●Japanese Millionaire | కుక్కలా అవతారమెత్తిన మిలినీయర్.. ఖర్చు రూ. 220 కోట్లు..!
- ●KTR | అదే జరిగితే తెలంగాణ ఉద్యమానికి మించి మరో జల ఉద్యమం పుట్టుకొస్తుంది
- ●Jemimah Rodrigues | జెమీమా రోడ్రిగ్స్‌కు గాయం.. ఆసియా కప్ ఆడేది డౌటే!
- ●Fighter Jets | 6వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి దిశగా భారత్.. రోడ్ మ్యాప్‌కు కసరత్తు..

Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచనలు..!

PhonePe | ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులు ఉచితమే..

Japanese Millionaire | కుక్కలా అవతారమెత్తిన మిలినీయర్.. ఖర్చు రూ. 220 కోట్లు..!

KTR | అదే జరిగితే తెలంగాణ ఉద్యమానికి మించి మరో జల ఉద్యమం పుట్టుకొస్తుంది






