త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lord Uday Nagaraju | క‌ర్ణాట‌క సీఎంతో లార్డ్‌ ఉద‌య్ నాగ‌రాజు భేటీ..

Lord Uday Nagaraju | బ్రిట‌న్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన తెలంగాణ బిడ్డ లార్డ్‌ ఉద‌య్ నాగ‌రాజు (Lord Uday Nagaraju) క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్‌తో (DK Shivakumar) భేటీ అయ్యారు. బెంగ‌ళూరులోని విధాన సౌధ‌లో సీఎంతో స‌మావేశ‌మ‌య్యారు.

G

National | Published On Aug 8, 2026, 9.25 am IST

Lord Uday Nagaraju | క‌ర్ణాట‌క సీఎంతో లార్డ్‌ ఉద‌య్ నాగ‌రాజు భేటీ..
Advertisement

Lord Uday Nagaraju | త్రినేత్ర‌.న్యూస్‌: బ్రిట‌న్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన తెలంగాణ బిడ్డ లార్డ్‌ ఉద‌య్ నాగ‌రాజు (Lord Uday Nagaraju) క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్‌తో (DK Shivakumar) భేటీ అయ్యారు. బెంగ‌ళూరులోని విధాన సౌధ‌లో సీఎంతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాటక ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న ఏఐ యూనివ‌ర్సిటీ (AI University) గురించి చ‌ర్చించామ‌ని చెప్పారు.

అదేవిధంగా ప్రైవేటు రంగంతోపాటు యూకే విద్యారంగంలో ఏఐతో (AI) అవ‌కాశాలపై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. యూకే, భార‌త్ సంబంధాల‌ను (UK-India Relations) స‌మ‌ర్ధిస్తున్న వ్య‌క్తిగా రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని మరింత బ‌లోపేతం చేసే కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్దతు ఇవ్వ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పారు. త‌మ భేటీ సుహృద్భావ వాతావ‌ర‌ణంలో సాగింద‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement