Apple | యాపిల్‌లో కొత్త శకం.. ఏఐతో అప్ డేట్ అయిన సిరి.. కొత్త ఓఎస్‌లలో యాపిల్ ఇంటెలిజెన్స్..
Apple | ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 (WWDC26) ఈవెంట్‌లో యాపిల్ తన యాపిల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి అత్యంత కీలకమైన అప్‌గ్రేడ్‌లను ప్రకటించింది.
Technology | Published On Jun 9, 2026, 10.42 am IST
Apple | ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 (WWDC26) ఈవెంట్‌లో యాపిల్ తన యాపిల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి అత్యంత కీలకమైన అప్‌గ్రేడ్‌లను ప్రకటించింది. వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, తెలివైన, శక్తివంతమైన ఏఐ అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త సిరి ఏఐ, ఫోటోస్ యాప్‌లో అధునాతన ఎడిటింగ్ టూల్స్, సఫారీ బ్రౌజర్‌లో స్మార్ట్ ఫీచర్లు, కొత్త ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలు సహా అనేక అప్‌డేట్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. యాపిల్ తెలిపిన వివరాల ప్రకారం తదుపరి తరం యాపిల్ ఇంటెలిజెన్స్ కొత్త యాపిల్ ఫౌండేషన్ మోడల్స్‌పై ఆధారపడి పనిచేస్తుంది. గూగుల్ జెమినీ మోడల్స్‌తో భాగస్వామ్యంగా అభివృద్ధి చేసిన ఈ మోడల్స్ డివైస్‌లలోనూ, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ సర్వర్ల ద్వారానూ పనిచేస్తాయి. దీంతో వినియోగదారులకు అత్యాధునిక ఏఐ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తూనే, వ్యక్తిగత డేటా భద్రత కూడా కొనసాగుతుందని యాపిల్ పేర్కొంది.
సిరికి అతి పెద్ద మార్పు..
యాపిల్‌కు చెందిన డిజిటల్ అసిస్టెంట్ సిరి తన చరిత్రలోనే అతిపెద్ద మార్పును పొందింది. సిరి ఏఐ పేరుతో వచ్చిన ఈ కొత్త వెర్షన్ మరింత వ్యక్తిగతమైన, సంభాషణాత్మకమైన, తెలివైన సహాయకారిగా పనిచేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ విజన్ ప్రోలో ప్రత్యేక సిరి యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలకు సిరి సమాధానాలు ఇస్తుంది. గత సంభాషణలను తిరిగి చూడడం, కొత్త సంభాషణలను ప్రారంభించడం, ఐక్లౌడ్ ద్వారా అన్ని డివైస్‌లలో సంభాషణ చరిత్రను సురక్షితంగా అప్‌డేట్ చేయడం సాధ్యమవుతుంది. అదేవిధంగా వినియోగదారుడి వ్యక్తిగత సందర్భాన్ని అర్థం చేసుకుని యాప్‌లలో శోధించడం, వెబ్ నుంచి తాజా సమాచారాన్ని సేకరించడం, థర్డ్ పార్టీ, యాపిల్ యాప్‌లలో చర్యలు చేపట్టడం వంటి పనులను కూడా సిరి ఏఐ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లిష్ లో మాత్రమే డెవలపర్ టెస్టింగ్ కోసం ఐఓఎస్ 27, ఐప్యాడ్ ఓఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27, విజన్ ఓఎస్ 27లో అప్‌డేట్ అయిన సిరి అందుబాటులోకి వచ్చింది. అందువల్ల భవిష్యత్తులో ఈ ఓఎస్‌లు ఆయా డివైస్‌లకు రిలీజ్ అయితే వాటిల్లో కొత్త సిరిని పొందవచ్చు.

ఫొటోస్ యాప్ లో..
ఇక ఫోటోస్ యాప్‌లో మూడు కీలక ఏఐ ఫీచర్లను ఇచ్చారు. స్పేషియల్ రీఫ్రేమింగ్ ద్వారా ఫోటో తీసిన తర్వాత కూడా కెమెరా కోణాన్ని మార్చినట్లుగా ఫోటో దృశ్యాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఎక్స్‌టెండ్ ఫీచర్ సహాయంతో ఫోటో అంచులను విస్తరించడం, వంగిన హరైజన్‌ను కట్ చేయకుండా సరిచేయడం, మిస్సింగ్ భాగాలను ఏఐతో నింపడం సాధ్యమవుతుంది. క్లీన్ అప్ అప్‌గ్రేడ్ ద్వారా ఫోటోల్లో అనవసర అంశాలను మరింత సహజంగా తొలగించవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడిట్ చేసిన ఫోటోల్లో దాచిన సింథ్‌ఐడి వాటర్‌మార్క్ ఆటోమేటిగ్గా యాడ్ అవుతుంది. అందువల్ల ఫొటోను ఏఐతో ఎడిట్ చేశారన్న విషయం సులభంగా తెలిసిపోతుంది. ఇక సఫారీ బ్రౌజర్‌లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ పెద్ద మార్పులను తీసుకొచ్చింది. ఓపెన్ చేసిన ట్యాబ్‌లను సంబంధిత అంశాల ప్రకారం ఆటోమేటిక్‌గా సమూహాలుగా విభజించే ట్యాబ్ ఆర్గనైజేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
వెబ్‌పేజీలను ట్రాక్ చేయొచ్చు..
నోటిఫై మీ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒక వెబ్‌పేజీని పర్యవేక్షించమని సఫారీకి చెప్పవచ్చు. ఉత్పత్తి మళ్లీ స్టాక్‌లోకి రావడం లేదా ధర తగ్గడం వంటి మార్పులు జరిగినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. బలహీనమైన లేదా రిస్క్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లను గుర్తించి వెబ్‌సైట్‌లలో స్వయంగా లాగిన్ అయి మరింత బలమైన పాస్‌వర్డ్‌లతో అప్‌డేట్ చేసే పాస్‌వర్డ్ అప్‌గ్రేడ్ ఫీచర్ కూడా వచ్చింది. అలాగే వినియోగదారు కోరుకున్న విధంగా కేవలం వివరణ ఇచ్చి కస్టమ్ సఫారీ ఎక్స్‌టెన్షన్ ను సృష్టించుకునే సౌకర్యం కల్పించింది. ఇక ఇమేజ్ ప్లేగ్రౌండ్‌కు కొత్త జనరేటివ్ మోడల్ ను ఇచ్చారు. ఇది ఫోటోరియలిస్టిక్ చిత్రాలను సృష్టిస్తుంది. వినియోగదారులు దాదాపు ఏ శైలిలోనైనా చిత్రాలను రూపొందించవచ్చు. చిత్రాల్లో మార్పులు చేయాలని వివరిస్తే లేదా ప్రత్యేక వస్తువులను టచ్ చేసి, చుట్టూ గీసి, బ్రష్‌తో గుర్తిస్తే వాటిని తరలించడం లేదా పరిమాణం మార్చడం సాధ్యమవుతుంది. ఈ చిత్రాలను లాక్ స్క్రీన్ వాల్‌పేపర్లు, కాంటాక్ట్ పోస్టర్లుగా ఉపయోగించుకోవచ్చు. అన్ని ఏఐ జనరేట్ చేసిన చిత్రాల్లో కూడా సింథ్‌ఐడీ వాటర్‌మార్క్ ను ఇస్తారు.

వన్-ట్యాప్ సూచనలు..
మెసేజెస్‌లో సంభాషణ ఆధారంగా వన్-ట్యాప్ సూచనలు అందుతాయి. ఫోటోలను కీవర్డ్స్, లొకేషన్లు, వ్యక్తుల ఆధారంగా వేగంగా కనుగొనవచ్చు. మెయిల్‌లో థర్డ్ పార్టీ యాప్‌లతో చర్యలు తీసుకునే సూచనలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ రిప్లై వినియోగదారుడి వ్యక్తిగత రచనా శైలిని అనుసరిస్తుంది. వ్యాపార సంస్థలకు కాల్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ కోడ్లు లేదా రిజర్వేషన్ నంబర్ల వంటి సమాచారం ముందుగానే చూపించే కాల్ కాంటెక్స్ట్ ఫీచర్ పూర్తిగా డివైస్‌లోనే పనిచేస్తుంది. క్యాలెండర్‌లో ఈవెంట్‌ను కేవలం వివరిస్తే చాలు. కాంటాక్టులు, ప్రదేశాలు గుర్తించి స్వయంగా ఈవెంట్ టైటిల్ రూపొందించి చేరుస్తుంది. అలాగే కేవలం వివరణలతో షార్ట్‌కట్స్ సృష్టించే సదుపాయం ఇచ్చారు. డిస్క్రైబ్ ఎ షార్ట్‌కట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము కోరుకున్న ఆటోమేషన్‌ను మాటల్లో వివరించగానే షార్ట్‌కట్స్ యాప్ అవసరమైన స్టెప్‌లను ఆటోమేటిగ్గా రూపొందిస్తుంది. తరువాత మార్పులు కోరితే వాటిని కూడా అనుగుణంగా సవరిస్తుంది.
ఎప్పుడు వస్తున్నాయి..?
హోమ్ యాప్‌లో సంబంధిత నోటిఫికేషన్‌లను ఒకే అప్‌డేటింగ్ నోటిఫికేషన్‌గా సమూహీకరించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. హోమ్‌కిట్ సెక్యూర్ వీడియో కెమెరా క్లిప్‌లకు వీడియో వివరణలను రూపొందించడం, ప్రత్యేక సంఘటనలను వెతకడం, ముఖ్యమైన క్లిప్‌లను ఆటోమేటిగ్గా ముందుకు తీసుకురావడం వంటి ఫీచర్లను కూడా ఇచ్చారు. సిస్టమ్ స్థాయిలో మెరుగైన స్పెల్లింగ్, గ్రామర్ సవరణలు, కంటెంట్ ఆధారంగా ఫైళ్లు, ఫోల్డర్లకు తెలివైన పేర్ల సూచనలు, జెన్‌మోజీ నాణ్యత మెరుగుదలలు, ఫిట్‌నెస్ ఫీచర్లలో కొత్త సామర్థ్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ ఓవర్, మ్యాగ్నిఫైయర్, వాయిస్ కంట్రోల్, యాక్సెసిబిలిటీ రీడర్ వంటి యాక్సెసిబిలిటీ టూల్స్‌కు కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అప్‌డేట్‌లను అందించారు. ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా డెవలపర్ టెస్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలలో పబ్లిక్ బీటా విడుదల కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఓఎస్ 27, ఐప్యాడ్ ఓఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27, వాచ్ ఓఎస్ 27, విజన్ ఓఎస్ 27 సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.

తొలుత ఇంగ్లిష్‌లోనే..
సిరి ఏఐ మొదట ఇంగ్లిష్‌లో మాత్రమే విడుదల కానుంది. ప్రారంభ దశలో యూరోపియన్ యూనియన్‌లో ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లలో అందుబాటులో ఉండదు. అలాగే చైనాలో కూడా లాంచ్ సమయంలో అందుబాటులోకి రాదు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 15 లేదా ఆపైన వచ్చిన మోడల్స్, ఐప్యాడ్ మినీ లేదా ఆ తరువాత రిలీజ్ అయిన మోడల్స్, ఎం1 లేదా అంతకంటే కొత్త చిప్ కలిగిన ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు, ఆపిల్ విజన్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్ 9 లేదా తదుపరి మోడల్స్ లో పనిచేస్తుంది. ఈ ప్రకటనపై స్పందించిన యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిఘీ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను అందరికీ ఉపయోగకరమైన, సహజమైన ఉత్పత్తులుగా మార్చడం యాపిల్ లక్ష్యమని తెలిపారు. వినియోగదారుల అవసరాల చుట్టూ తిరిగే, వ్యక్తిగత సందర్భాన్ని అర్థం చేసుకునే, గోప్యతను ప్రతి దశలో కాపాడే ఏఐనే యాపిల్ ఇంటెలిజెన్స్ దృష్టికోణమని పేర్కొన్నారు. వెబ్ బ్రౌజింగ్, సృజనాత్మకత, ఫోటో ఎడిటింగ్ తదితర రంగాల్లో కొత్త ఫీచర్లతో యాపిల్ ప్లాట్‌ఫామ్‌లలో శక్తివంతమైన ఏఐ అప్‌డేట్‌కు ఇది పెద్ద ముందడుగని ఆయన అన్నారు.
సంబంధిత వార్తలు

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..
మే 27, 2026

Meta Forum App | మెటా సీక్రెట్‌గా కొత్త యాప్ ‘ఫోరం’ లాంచ్.. రెడిట్‌కు భారీ పోటీ..
మే 23, 2026

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026
తాజావార్తలు
- ●RGV Tweet on Donald Trump | ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!
- ●DK Shivakumar | డీకేకి తగ్గని తలనొప్పి.. శాఖల కేటాయింపులపై కొనసాగుతున్న మంత్రుల అలక.. ఢిల్లీకి క్యూ
- ●ACB Raids | ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
- ●Philippines Tsunami 2026 | ఫిలిప్పీన్స్‌లో రాకాసి అలల విధ్వంసం.. తీరప్రాంతాల్లో సునామీ భయం!
- ●Stock Markets | మార్కెట్లు మళ్లీ జోష్‌లో.. సెన్సెక్స్ 389 పాయింట్లు పైకి..
- ●Singareni Strike | సమ్మెకు సిద్ధమవుతున్న సింగరేణి.. ఎప్పటి నుంచంటే?

RGV Tweet on Donald Trump | ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!

DK Shivakumar | డీకేకి తగ్గని తలనొప్పి.. శాఖల కేటాయింపులపై కొనసాగుతున్న మంత్రుల అలక.. ఢిల్లీకి క్యూ

ACB Raids | ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

Philippines Tsunami 2026 | ఫిలిప్పీన్స్‌లో రాకాసి అలల విధ్వంసం.. తీరప్రాంతాల్లో సునామీ భయం!



