త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ – ప్యార‌డైజ్‌కు పోటీగా మ‌హాన‌టి త‌మిళ మూవీ రిలీజ్‌

నాని ప్యార‌డైజ్ మూవీలో కీర్తి సురేష్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. సెప్టెంబ‌ర్ 24న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఆ త‌ర్వాత రోజు కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డోర‌తి థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. తాను స్పెష‌ల్ సాంగ్ చేసిన సినిమాతోనే బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హాన‌టి పోటీప‌డ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Aug 8, 2026, 6.49 pm IST

Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ – ప్యార‌డైజ్‌కు పోటీగా మ‌హాన‌టి త‌మిళ మూవీ రిలీజ్‌
Advertisement

Keerthy Suresh | నానితో బాక్సాఫీస్ క్లాష్‌కు మ‌హాన‌టి కీర్తి సురేష్ రెడీ అయ్యింది. నాని ప్యార‌డైజ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు అదే సినిమాతో పోటీపడ‌బోతుంది. నాని ప్యార‌డైజ్ రిలీజైన త‌ర్వాత రోజే కీర్తి సురేష్ త‌మిళ మూవీ డోర‌తి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఓ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌తో మ‌రో సినిమాలో హీరోయిన్‌గా ఒక్క రోజు గ్యాప్‌తో కీర్తి సురేష్ రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

స్పెష‌ల్ సాంగ్‌....

నాని హీరోగా న‌టించిన ప్యార‌డైజ్ మూవీ సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ అవుతోంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో నాని, కీర్తి సురేష్‌ల‌పై ఈ స్పెష‌ల్ సాంగ్‌ను షూట్ చేశారు.ఈ పాట కోసం కోటిన్న‌ర వ‌ర‌కు మ‌హాన‌టి రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే ప్యార‌డైజ్ టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ అంశాల‌తో అద‌ర‌గొట్టింది. ఈ టీజ‌ర్‌లోనే ప్యార‌డైజ్ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. సెప్టెంబ‌ర్ 24న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

1540వ సినిమా

ప్యార‌డైజ్ తో బాక్సాఫీస్ వ‌ద్ద కీర్తి సురేష్‌ డోర‌తి పోటీప‌డ‌బోతుంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
సెప్టెంబ‌ర్ 25న డోర‌తి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడికి ఇది 1540వ సినిమా. రిలీజ్‌కు ముందే డోర‌తి మూవీ టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఫ‌స్ట్ మూవీగా నిలిచింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.

లైన‌ప్‌లో ఏడు సినిమాలు

ప్యార‌డైజ్‌, డోర‌తి కాకుండా కీర్తి సురేష్ మ‌రో ఐదు సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మ‌ల్టీస్టార‌ర్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హిందీలో ర‌ఫ్తార్ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే త‌మిళంలో రెండు, మ‌ల‌యాళంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టింది.

 

Advertisement
Advertisement