త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EC Vs TMC | ఈసీ, తృణ‌మూల్ మ‌ధ్య వాగ్వాదం.. టీఎంసీకి ఎన్నిక‌ల సంఘం అల్టిమేటం

EC Vs TMC | ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress), ఎన్నిక‌ల క‌మిష‌న్ (Election Commission) మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం ర‌సాభాసగా సాగింది.

D

National | Published On Apr 8, 2026, 3.13 pm IST

EC Vs TMC | ఈసీ, తృణ‌మూల్ మ‌ధ్య వాగ్వాదం.. టీఎంసీకి ఎన్నిక‌ల సంఘం అల్టిమేటం
Advertisement

EC Vs TMC | ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress), ఎన్నిక‌ల క‌మిష‌న్ (Election Commission) మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం ర‌సాభాసగా సాగింది. స‌మావేశం ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ (CEC Gyanesh Kumar), తృణ‌మూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియ‌న్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈసీ, టీఎంసీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఈ వాగ్వాదం రాజకీయ వివాదానికి దారితీసింది.

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ త‌మ ప్ర‌తినిధి బృందాన్ని గెట్ లాస్ట్ అన్నార‌ని టీఎంసీ ఆరోపించింది. సీఈసీతో త‌మ స‌మావేశం కొన్ని నిమిషాలు మాత్ర‌మే జ‌రిగింద‌ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రియ‌న్ తెలిపారు. "ఈరోజు మేము ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిశాము. సమావేశం మొదలైన 7 నిమిషాల్లోనే ఆయన మమ్మల్ని బ‌య‌ట‌కు వెళ్లిపోమ‌న్నారు. సమావేశం ఉదయం 10:02 గంటలకు ప్రారంభమై 10:07 గంటలకు ముగిసింది" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ స‌మావేశంలో టీఎంసీ పార్టీ ఎంపీ అరుస్తూ గంద‌ర‌గోళం సృష్టించిన‌ట్లు ఈసీ ఆరోపించింది. అదే స‌మ‌యంలో తృణ‌మూల్ పార్టీకి ఈసీ అల్టిమేటం జారీ చేసింది. బెంగాల్‌లో స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఎన్నిక‌లు జ‌రిగేందుకు స‌హ‌క‌రించాల‌ని సూచించింది. ఓటింగ్‌కు అంత‌రాయం క‌లిగిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

Also Read..

వెంట‌నే ఇరాన్‌ను వీడండి.. కాల్పుల విర‌మ‌ణ వేళ భార‌తీయుల‌కు కేంద్రం కీల‌క అడ్వైజ‌రీ

సామాన్యుడిలా మెట్రో రైల్లో ప్ర‌యాణించిన‌ మంత్రి జూపల్లి

మ‌రోవివాదంలో డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్‌.. హిందూ సంఘాలు ఫైర్‌

Advertisement
Advertisement