త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India | వెంట‌నే ఇరాన్‌ను వీడండి.. కాల్పుల విర‌మ‌ణ వేళ భార‌తీయుల‌కు కేంద్రం కీల‌క అడ్వైజ‌రీ

India | కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం (ceasefire) కుదిరిన వేళ ఇరాన్‌లోని త‌మ పౌరుల‌కు భార‌త్ (India) కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. వీలైనంత త్వ‌ర‌గా ఇరాన్‌ను వీడాల‌ని సూచించింది.

D

National | Published On Apr 8, 2026, 1.54 pm IST

India | వెంట‌నే ఇరాన్‌ను వీడండి.. కాల్పుల విర‌మ‌ణ వేళ భార‌తీయుల‌కు కేంద్రం కీల‌క అడ్వైజ‌రీ
Advertisement

India | కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం (ceasefire) కుదిరిన వేళ ఇరాన్‌లోని త‌మ పౌరుల‌కు భార‌త్ (India) కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. వీలైనంత త్వ‌ర‌గా ఇరాన్‌ను వీడాల‌ని సూచించింది. ఈ మేర‌కు ఇరాన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ (Indian Embassy in Tehran) ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇంకా ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు వెంట‌నే అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని సూచించింది. రాయబార కార్యాలయంతో (Embassy) సమన్వయం చేసుకుంటూ ఎంబ‌సీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా త్వరితగతిన ఇరాన్‌ను వీడాల‌ని తెలిపింది. భారత ఎంబసీని సంప్రదించకుండా ఏ అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దువైపు వెళ్ల‌రాద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు పౌరుల‌కు హెల్ప్‌లైన్ నంబ‌ర్ల‌ను షేర్ చేసింది. 989128109115, 989128109109, 989128109102, 989932179359, cons.tehran@mea.gov.in ఎంబ‌సీ మెయిల్‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది.

కాగా, నిన్న రాత్రి కూడా ఇరాన్‌లోని త‌మ పౌరుల‌కు విదేశాంగ శాఖ కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసిన విష‌యం తెలిసిందే. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌ను మానుకోవాల‌ని, ఇళ్ల‌లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని సూచించింది. అయితే, యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప‌డ‌టంతో తాజాగా మ‌రో అడ్వైజ‌రీ జారీ చేసింది. ఇరాన్‌ను వెంట‌నే వీడాల‌ని సూచించింది.

Also Read..

నామినేష‌న్ దాఖ‌లు చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. సువేందు అధికారిని దీదీ ఓడించ‌నుందా..?

మ‌రోవివాదంలో డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్‌.. హిందూ సంఘాలు ఫైర్‌

ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు.. సీజ్​ఫైర్​పై ట్రంప్

Advertisement
Advertisement