Jupalli Krishna Rao | సామాన్యుడిలా మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి
Jupalli Krishna Rao | తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) హైదరాబాద్ నగరవాసులను సర్‌ప్రైజ్ చేశారు. ఇవాళ ఉదయం సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Jupalli Krishna Rao | తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) హైదరాబాద్ నగరవాసులను సర్‌ప్రైజ్ చేశారు. ఇవాళ ఉదయం సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి సాదాసీదాగా ఆయన మెట్రో ఎక్కారు. ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు.
మెట్రో స్టేషన్‌కు చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితో పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.
Also Read..
నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ.. సువేందు అధికారిని దీదీ ఓడించనుందా..?
ఐఆర్ఎఫ్‌సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే?
తాజావార్తలు
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!
- ●Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా





