త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | అర‌కు లోయ‌లో భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి ప‌రుగులు తీసిన జ‌నం

Earthquake | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంత‌మైన అర‌కు లోయ‌లో భూకంపం (Earthquake) వ‌చ్చింది. ఆదివారం రాత్రి 11.30 గంట‌ల‌కు అర‌కు లోయ‌, పాడేరు, పెద‌బ‌య‌లు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

G

National | Published On Apr 5, 2026, 7.37 am IST

Earthquake | అర‌కు లోయ‌లో భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి ప‌రుగులు తీసిన జ‌నం
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంత‌మైన అర‌కు లోయ‌లో భూకంపం (Earthquake) వ‌చ్చింది. ఆదివారం రాత్రి 11.30 గంట‌ల‌కు అర‌కు లోయ‌, పాడేరు, పెద‌బ‌య‌లు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ తెలిపింది. భూకంప కేంద్రం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది.

సుమారు 30 సెకన్ల పాటు ప్రకంపనలు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో భూమి కంపించ‌డంతో ఏం జరుగుతుందో తెలియక ఇండ్ల‌లో నిద్రిస్తున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎన్నడూలేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement