త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon 5G Tablet Days Sale | అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ట్యాబ్‌ల‌పై భారీగా డిస్కౌంట్‌..

Amazon 5G Tablet Days Sale | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌త్యేకంగా 5జి ట్యాబ్లెట్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా 5జి సెల్యులార్ ఆధారిత ట్యాబ్‌ల‌పై ప్ర‌త్యేక రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. యాపిల్‌, శాంసంగ్‌, లెనోవో వంటి కంపెనీల‌కు చెందిన 5జి ట్యాబ్‌ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కే పొంద‌వ‌చ్చు.

S

Technology | Published On Apr 21, 2026, 11.52 am IST

Amazon 5G Tablet Days Sale | అమెజాన్‌లో ప్ర‌త్యేక సేల్‌.. ట్యాబ్‌ల‌పై భారీగా డిస్కౌంట్‌..
Advertisement

Amazon 5G Tablet Days Sale | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌త్యేకంగా 5జి ట్యాబ్లెట్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా 5జి సెల్యులార్ ఆధారిత ట్యాబ్‌ల‌పై ప్ర‌త్యేక రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. యాపిల్‌, శాంసంగ్‌, లెనోవో వంటి కంపెనీల‌కు చెందిన 5జి ట్యాబ్‌ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కే పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో ప‌లు ఉత్ప‌త్తుల‌పై ఏకంగా 40 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సేల్ ఈనెల 25 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని అమెజాన్ తెలిపింది.

ఏస‌ర్‌, లెనోవో..

ఈ సేల్‌లో భాగంగా ఏస‌ర్ ఐకానియా ఐఎం11-22ఎం5జి ట్యాబ్‌ 8జీబీ, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను త‌గ్గింపు అనంతరం రూ.21,999 కు కొన‌వ‌చ్చు. ఇందులో 11.45 ఇంచుల 2.2కె డిస్‌ప్లే, మీడియాటెక్ 8791 ప్రాసెస‌ర్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, వైఫై, ఆండ్రాయిడ్ 15 వంటి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. అలాగే లెనోవో ఐడియా ట్యాబ్ కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను రూ.26,997కి అందిస్తున్నారు. ఇందులో 5జి, వైఫై, 11 ఇంచుల 2.5కె డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌, డాల్బీ అట్మోస్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి. అలాగే లెనోవో ఐడియా ట్యాబ్ ప్ల‌స్ విత్ పెన్ (8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌) ను రూ.28,999కు ఇస్తున్నారు. ఇందులో 12.1 ఇంచ్ 2.5కె డిస్‌ప్లే, ఇత‌ర స‌దుపాయాలు ఉన్నాయి.

శాంసంగ్‌..

శాంసంగ్ గెలాక్సీ ట్యాట్ ఎ11 ట్యాబ్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్‌ను రూ.33,999కు ఇస్తున్నారు. ఇందులో 11 ఇంచుల డిస్‌ప్లే, గూగుల్ జెమిని ఏఐ, డాల్బీ అట్మోస్‌, క్వాడ్ స్పీక‌ర్లు, వైఫై వంటి స‌దుపాయాలు ఉన్నాయి. ఇక 12.1 ఇంచ్ 2.8కె డిస్‌ప్లే, డాల్బీ విజ‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, క్వాడ్ స్పీక‌ర్స్‌, ఏఐ, 10,050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5జి, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ వంటి ఫీచ‌ర్లు క‌లిగిన వ‌న్‌ప్ల‌స్ ప్యాడ్ గో2 ట్యాబ్‌ను రూ.33,999కి ఇస్తున్నారు. ఇక 10.9 ఇంచుల డిస్‌ప్లే, ఆబ్జెక్ట్ ఎరేజ‌ర్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఐపీ42 రేటింగ్‌, 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, వైపై, 5జి వంటి స‌దుపాయాలు ఉన్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్‌10 లైట్ ను రూ.38,499కి ఇస్తున్నారు.

యాపిల్ ఐప్యాడ్‌లు..

ఇక ఈసేల్‌లో యాపిల్‌కు ఐప్యాడ్ ట్యాబ్‌లు తగ్గింపు అనంతరం రూ.49,900 ప్రారంభ ధ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. ఐప్యాడ్ 11 (ఎ16), ఐప్యాడ్ ఎయిర్ 11 (ఎం3), ఐప్యాడ్ ప్రొ 13 (ఎం5), ఐప్యాడ్ ప్రొ 11 (ఎం5) ట్యాబ్‌ల‌ను ఈ సేల్‌లో డిస్కౌంట్ ధ‌ర‌ల‌కే వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో 6 నెల‌లు లేదా అంత‌క‌న్నా ఎక్కువ కాల‌వ్య‌వ‌ధితో ఈఎంఐ విధానంలో చేసే లావాదేవీల‌పై రూ.10వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. దీంతో ట్యాబ్‌ల ధ‌ర ఇంకా భారీగా త‌గ్గుతుంది. అదే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ విధానం అయితే రూ.2250, హెచ్ఎస్‌బీసీ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డుల‌పై రూ.2500, వ‌న్ కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ విధానం అయితే రూ.3500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు అమెజాన్‌లోని 5జి ట్యాబ్లెట్ డేస్ సేల్ పేజీని సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement