Ntr | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్ – డ్రాగన్ టైటిల్ ఛేంజ్?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ ఏడాది జూన్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం రివీల్ చేశారు.
Entertainment | Published On Apr 21, 2026, 12.05 pm IST
Ntr | జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2027 జూన్ 11న డ్రాగన్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
డ్రాగన్ టైటిల్ మారుతోందా?
రిలీజ్ డేట్‌తో పాటు ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. టైటిల్ లేకుండా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. డ్రాగన్ టైటిల్ ఛేంజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కోసం మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ ఫిక్స్ చేశారట. ఫస్ట్ గ్లింప్స్ తో పాటే మే 20న కొత్త టైటిల్‌ను కూడా రివీల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విలన్ ఎవరు?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ షూట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో విలన్ కోసం కూడా ప్రశాంత్ నీల్ టీమ్ అన్వేషణ సాగిస్తోన్నారట. తొలుత మలయాళ హీరో టోవినో థామస్ విలన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కావడంతో టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అతడి ప్లేస్‌లో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, వివేక్ ఒబెరాయ్‌లలో ఒకరిని విలన్‌గా ఎంపికచేసే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారట.
రుక్మిణి వసంత్....
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత కొరటాల శివతో దేవర 2 చేయబోతున్నారు ఎన్టీఆర్.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



