త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. వాటి మ‌ధ్య‌న న‌లిగి మ‌హిళా టూరిస్ట్ మృతి

Elephants | స‌ర‌దాగా వైల్డ్‌లైఫ్ క్యాంప్‌కు (Karnataka Wildlife Camp) వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. రెండు ఏనుగుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది.

D

National | Published On May 18, 2026, 5.07 pm IST

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. వాటి మ‌ధ్య‌న న‌లిగి మ‌హిళా టూరిస్ట్ మృతి
Advertisement

Elephants | స‌ర‌దాగా వైల్డ్‌లైఫ్ క్యాంప్‌కు (Karnataka Wildlife Camp) వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది. రెండు ఏనుగుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డికి వ‌చ్చిన ప‌ర్యాట‌కులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కొడగు (Kodagu) జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. చెన్నై (Chennai)కి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ (Jyunesh) అనే మ‌హిళ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా దుబేరా ఏనుగుల క్యాంప్‌కు వెళ్లింది. అక్క‌డికి వ‌చ్చిన ప‌ర్యాట‌కులంతా ఏనుగుల‌కు స్నానం చేయించ‌డాన్ని ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఆ స‌మ‌యంలో 'కాంచన', 'మార్తాండ' అనే రెండు ఏనుగుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. మార్తాండపై కాంచ‌న విరుచుకుప‌డింది. వీటి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ను అదుపు చేసేందుకు మావ‌టిలు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో వాటి మ‌ధ్య పోరు అలాగే కొన‌సాగింది. కాసేప‌టికి ఓ ఏనుగు నియంత్ర‌ణ కోల్పోయి అక్క‌డే ఉన్న జ్యునేష్‌పై ప‌డింది. ఆ ఏనుగు పైకి లేచే క్ర‌మంలో మ‌హిళ‌ను తీవ్రంగా తొక్కేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌తో స‌ర‌దాగా సాగిన వీరి విహారం విషాదంతో ముగిసింది.

ఈ ఘ‌ట‌న‌ప‌ట్ల క‌ర్ణాట‌క అట‌వీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అట‌వీ ప్రాంతాలు, వైల్డ్‌లైఫ్ క్యాంపుల్లో ప‌ర్యాట‌కుల ర‌క్ష‌ణ కోసం క‌ఠిన‌మైన భ‌ద్ర‌తా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, వాటికి చాలా దగ్గరగా నిలబడి ఫోటోలు దిగడం, ఏనుగులకు స్నానం చేయించడం, వాటికి ఆహారం తినిపించడం వంటివి చేయకుండా నిరోధించాలని అధికారుల‌కు సూచించారు.

Also Read..

కేర‌ళం కేబినెట్‌లో అత్యంత సంప‌న్నుడు ఆయ‌నే.. 68 కేసుల‌తో ఆ నేతే టాప్‌..!

యూఏపీఏ కేసుల్లోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నీట్ పేప‌ర్ లీక్‌లో మ‌రో అరెస్ట్‌.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌కు చేరిన ప్ర‌శ్న‌ప‌త్రం

Advertisement
Advertisement