Keralam | కేరళం కేబినెట్‌లో అత్యంత సంపన్నుడు ఆయనే.. 68 కేసులతో ఆ నేతే టాప్..!
Keralam | కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా 20 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి పదవి రేసులో నిలిచిన సీనియర్ నేతలు రమేశ్ చెన్నితల, కే మురళధర్, అనిల్‌కుమార్ వంటి నేతలు సైతం మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
Keralam | కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా 20 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి పదవి రేసులో నిలిచిన సీనియర్ నేతలు రమేశ్ చెన్నితల, కే మురళధర్, అనిల్‌కుమార్ వంటి నేతలు సైతం మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. యూడీఎఫ్ కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, మిగతా నాలుగు పార్టీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో ముఖ్యమంత్రితో కలిపి కొత్త కేరళ కేబినెట్‌లో 21 మంది సభ్యులు ఉన్నారు.
కేబినెట్‌లో అత్యంత ధనవంతుడు..
వీడీ సతీశన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అత్యంత ధనవంతుడిగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నేత శిబు బేబ జాన్ నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ మేరకు ఆయన ఆస్తుల విలువ రూ.24.63కోట్లు. ఇక కొత్త కేబినెట్‌లో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతగా అడ్వకేట్ ఓజే జనీష్ నిలిచారు. ఆయనపై మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. అల్లర్లు, ప్రజా శాంతి భంగం కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత బిందు కృష్ణపై 49, టీ సిద్ధిఖీ 39, సీఎం సతీశన్ 18, రమేశ్ చెన్నితలపై ఏడు కేసులున్నాయి.
విద్యార్హతల విషయానికి వస్తే..
కేరళ కొత్త యూడీఎఫ్ మంత్రివర్గంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు. 20మంది మంత్రుల్లో 16 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ డిగ్రీలు చేసినవారున్నారు. ఇందులో న్యాయవాదులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. రోజీ ఎం జాన్ ఎంఫిల్, జేఎన్‌యూలో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. బిందు కృష్ణ, ఎం. లిజు ఎల్‌ఎల్‌ఎం పట్టాలు పొందారు. మోన్స్ జోసెఫ్ సోషియాలజీలో ఎంఏతో పాటు ఎల్‌ఎల్‌బీ చేశారు. తులసి టీచర్ చరిత్రలో ఎంఏ చేశారు. శిబు బేబీ జాన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. సీఎం వీడీ సతీశన్‌తో పాటు వీఈ అబ్దుల్ ఘఫూర్, ఎన్ షంసుద్దీన్, ఓజే జనీష్, టీ. సిద్ధిఖీ, అనూప్ జాకబ్ న్యాయ విద్యను అభ్యసించారు. కొంతమంది మంత్రులు స్కూల్ స్థాయి విద్యతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఏపీ అనిల్ కుమార్ ఇంటర్ వరకు చదవగా.. కేఎం షాజీ 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. పీకే బషీర్ 10వ తరగతి వరకు చదివారు. సన్నీ జోసెఫ్ నాలుగో తరగతి వరకు మాత్రమే విద్యను అభ్యసించారు.
జూనియర్లు, సీనియర్ల కలయికతో కేబినెట్
కొత్త కేబినెట్‌లో యువ నేతలతో పాటు సీనియర్ రాజకీయ నాయకులకు స్థానం లభించింది. 37 ఏళ్ల అడ్వకేట్ ఓజే జనీష్ కేబినెట్‌లో యువ మంత్రి కాగా, ఐయూఎంఎల్ సీనియర్ నేత పీకే కుంజాలికుట్టి 74 ఏళ్ల వయస్సుతో సీనియర్ నేతగా నిలిచారు. కే మురళీధరన్, రమేశ్ చెన్నితల ఇద్దరూ వయస్సు 69 కాగా.. మరోవైపు రోజీ ఎం జాన్ 43 ఏళ్లు, ఎం లిజు 46 ఏళ్ల వయసుతో యువ నేతల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






