త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jwala Gutta | జ్వాలా గుత్తా అమ్మ మ‌న‌సు.. ఏడాదిలో 60 లీట‌ర్ల త‌ల్లిపాలు దానం..!

Jwala Gutta | అమ్మపాలు శిశువుకు ఆహార‌మే కాదు.. ర‌క్ష‌ణ క‌వ‌చంగా ప‌ని చేస్తాయి. పుట్టిన క్షణం నుంచే తల్లి ఒడిలో లభించే ఈ సహజ పోషకాహారం, బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాదిలా నిలుస్తాయి. శిశు మరణాల రేటును తగ్గించడంలో, ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి.

P

Sports | Published On May 15, 2026, 7.36 pm IST

Jwala Gutta | జ్వాలా గుత్తా అమ్మ మ‌న‌సు.. ఏడాదిలో 60 లీట‌ర్ల త‌ల్లిపాలు దానం..!
Advertisement

Jwala Gutta | అమ్మపాలు శిశువుకు ఆహార‌మే కాదు.. ర‌క్ష‌ణ క‌వ‌చంగా ప‌ని చేస్తాయి. పుట్టిన క్షణం నుంచే తల్లి ఒడిలో లభించే ఈ సహజ పోషకాహారం, బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాదిలా నిలుస్తాయి. శిశు మరణాల రేటును తగ్గించడంలో, ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. త‌ల్లిపాల‌లోని ప్ర‌తి చుక్క‌లో రోగనిరోధక శక్తి దాగి ఉంటుంది. చిన్నపాటి జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాల నుంచి శిశువును కాపాడే సహజ రక్షణనిస్తాయి. ముఖ్యంగా పుట్టిన వెంట‌నే ప్రపంచాన్ని కూడా చూడ‌లేని బుజ్జి ప్రాణానికి అమ్మపాలు జీవనాధారం నిలుస్తాయి. అలాంటి త‌ల్లిపాల‌ను త‌న బిడ్డ ఒక్క‌రికే కాకుండా ఎంతో మందికి దానం చేస్తోంది మాజీ బ్యాడ్మింట‌న్ స్టార్ జ్వాలా గుత్తా. త‌ల్లిగా ఈ ఏడాది ప్ర‌యాణం గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన సేవ‌ల‌కు నెట్టింట ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

జ్వాలా గుత్తా హైదరాబాద్, చెన్నై ప్రభుత్వ ఆసుపత్రులకు సుమారు 60 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు వెల్ల‌డించింది. ఆ పాలు పుట్టిన పిల్ల‌ల‌కు, ముఖ్యంగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఉన్న శిశువుల కోసం నియోనేటల్ ఐసీయూ (NICU)లో ఉప‌యోగిస్తున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ఫొటోల‌ను సైతం షేర్ చేసింది. లేబుల్ చేసిన మిల్క్ బ్యాగ్స్‌, ఫ్రీజర్‌లో పెద్ద మొత్తంలో స్టోర్ చేసిన పాల బ్యాగ్స్ క‌నిపించాయి. తాను త‌ల్లిన‌య్యాక సంవ‌త్స‌రంలో హైదరాబాద్, చెన్నై ప్రభుత్వ ఆసుపత్రులకు సుమారు 60 లీటర్ల తల్లి పాలను దానం చేసిన‌ట్లుగా పేర్కొంది. డోనర్ మిల్క్ కూడా న‌వ‌జాత శిశువుల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతాయో వివ‌రించింది. కేవలం 100 మిల్లీలీటర్ల పాలు కూడా ఒక కిలో బరువు ఉన్న శిశువుకు అనేక రోజుల పాటు ఆహారంగా ఇవ్వొచ్చ‌ని చెప్పింది. ప్రమాదకర పరిస్థితుల్లో పుట్టిన శిశువులకు తల్లి పాలు దొరకని సమయంలో డోనర్ మిల్క్ “వారధి”గా ప‌ని చేస్తాయ‌ని చెప్పింది.

శిశువుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో, పోషణ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయ‌ని పేర్కొంది. అలాగే, తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో ప్రాణాంతకమైన ‘నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్’ వంటి సమస్యలు తగ్గించడంలో డోనర్ హ్యూమన్ మిల్క్ సహాయపడుతుందని వైద్య ప‌రిశోధ‌న‌లు సూచిస్తున్న‌ట్లుగా జ్వాలా గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది తక్కువ బరువుతో శిశువులు జ‌న్మిస్తున్నార‌ని, వారికి డోనర్ మిల్క్ ఎంతో అవసరమని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే, జ్వాలా గుత్తా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాతృత్వాన్ని అనుభ‌విస్తూ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా అవ‌గాహ‌న క‌ల్పించినందుకు నెటిజ‌న్లు అభినందిస్తున్నారు.

 

Advertisement
Advertisement