CM Vijay | స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్
CM Vijay | మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను నూతన సీఎం విజయ్ కలిశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
CM Vijay | తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ విజయ్ (CM Vijay) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)ను నూతన సీఎం విజయ్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం చెన్నై (Chennai)లోని అల్వార్‌పేట్‌లో గల స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన విజయ్‌కి మాజీ సీఎం స్వయంగా స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay meets former CM and DMK President MK Stalin and former Dy CM Udhayanidhi Stalin at their residence.
(Source: DMK) pic.twitter.com/xsmH7uzoeZ
— ANI (@ANI) May 11, 2026
కాగా, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్‌కి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టాలిన్ సూచనలతోనే సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు విజయ్‌కి మద్దతిచ్చాయి.
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay leaves from the residence of former CM and DMK President MK Stalin. pic.twitter.com/Ji2mVUmJtf
— ANI (@ANI) May 11, 2026
Also Read..
"పోఖ్రాన్"తో ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చాం : ప్రధాని మోదీ
నైతిక విలువలుంటే బండి సంజయ్ రాజీనామా చేయాలి : జీవన్‌రెడ్డి
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

CM Vijay | ప్రభుత్వ వాహనాన్ని స్వయంగా నడిపిన సీఎం విజయ్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



