Kalyan Banerjee | అమల్లోకి రాని చట్టానికి సవరణ ఎలా సాధ్యం.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫైర్
Kalyan Banerjee | లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంకా అమల్లోకి రాని చట్టానికి సవరణ ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు.
Kalyan Banerjee | లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై (Womens reservation Bill) సభలో చర్చ జరుగుతుండగా.. రాత్రికి రాత్రే ఈ చట్టం అమల్లోకి వచ్చిందంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్ వ్యవస్థ మొత్తాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ఇంకా అమల్లోకి రాని చట్టానికి సవరణ ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కళ్యాణ్ బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "మన ప్రధాన మంత్రికి ఓ గొప్ప గుణం ఉంది. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని గ్రహించిన వెంటనే.. ప్రధాని తన రాజకీయ ఆటలోని రూల్స్‌ను మార్చేస్తారు" అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ బిల్లును ప్రభుత్వం పన్నిన ఓ వ్యూహంగా ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు తేవడం వెనుక అసలు ప్లాన్ వేరే ఉందని వ్యాఖ్యానించారు.
వెంటనే అమలు చేయండి.. మద్దతిస్తాం..
ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తే అన్ని పార్టీలూ మద్దతిస్తాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత బిల్లు అమలుకు ఏ పార్టీ అంగీకరించదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అది కూడా నేటి నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. "కేంద్రం ఈరోజే బిల్లును ఆమోదిస్తే (పునర్విభజన తర్వాత కాకుండా) మేము అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, అలాంటి స్టెప్ తీసుకునే ధైర్యం కేంద్రానికి లేదు. ఇదంతా కేవలం ఓ డ్రామా మాత్రమే" అని టీఎంసీ ఎంపీ విమర్శించారు.
నారీ శక్తి గురించి బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది..
నారీ శక్తి, నారీ శక్తి వందన్ అధినియం గురించి బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ వాళ్లు సొంత పార్టీ నుంచే మహిళా అభ్యర్థులను చట్టసభల్లోకి పంపడం లేదని విమర్శించారు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీకి ఉన్న మహిళా ఎంపీల సంఖ్యను ఈ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ సభకు వివరించారు. లోక్‌సభలో బీజేపీకి ఉన్న 240 సీట్లలో కేవలం 31 మంది మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పారు. ఇక ఎగువ సభలో 106 సీట్లలో 18 మంది మహిళలు ఉన్నారన్నారు. అదే సమయంలో ఉభయసభల్లో తృణమూల్ పార్టీ తరఫున ఉన్న మహిళా అభ్యర్థుల వివరాలను కూడా ఆయన సభలో పంచుకున్నారు. టీఎంసీకి లోక్‌సభలో ఉన్న 29 సీట్లలో 11 మంది మహిళలే అని.. రాజ్యసభలో ఉన్న 13 సీట్లలో 6 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.
చట్టమే అమల్లోకి రాలేదు.. సవరణ ఎలా సాధ్యం..?
అమల్లోకి రాకముందే 2023 మహిళా కోటా చట్టాన్ని సవరించేందుకు బిల్లును తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. "మీరు (బీజేపీని ఉద్దేశిస్తూ) పార్లమెంటరీ వ్యవస్థ మొత్తాన్ని పరిహాసంగా మార్చేశారు. ఏ చట్టమైతే ఇంకా అమల్లోకే రాలేదో.. దానికి సవరణ ఎలా చేస్తారు..?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు చట్టాన్ని నోటిఫై చేసిన వెంటనే దానికి సంబంధించిన సవరణపై చర్చించడం వెనుక ఉన్న తర్కాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం అన్యాయమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన ఆరోపించారు.
మంత్రివర్గంలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు ఇవ్వాలి..
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగానే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. అంతేకాదు.. మంత్రివర్గంలోనూ మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించాలని సూచించారు. అలాగే రొటేషన్ పద్ధతిలో ప్రధాన మంత్రి పదవి, స్పీకర్ స్థానాన్ని కూడా మహిళలకు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. “ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెడుతున్నందునే మేము దీనిని వ్యతిరేకిస్తున్నాము. మహిళా రిజర్వేషన్ అనేది బేరసారాలకు సంబంధించిన విషయం కాదు” అంటూ కళ్యాణ్ బెనర్జీ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read..
ఆ బిల్లులకు మద్దతిస్తున్నాం.. కానీ, నోటిమాట మాత్రమే సరిపోదు : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
రేవంత్‌ది మజ్లిస్ ఫార్ములా.. హైబ్రిడ్ ఫార్ములా కాదు: కిషన్‌రెడ్డి
అంబానీని వెనక్కి నెట్టి..! ఆసియా కుబేరుడిగా గౌతమ్ ఆదానీ..!
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






