Rabi Crops | రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Rabi Crops | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి నిర్దేశిత రబీ పంటల (Rabi Crops) కనీస మద్దతు ధరల పెంపునకు (MSP hike) ఆమోదం తెలిపింది. ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎమ్ ధార’ (PM DHARA) పథకానికి కేబినెట్ రూ.1,86,405 కోట్లు కేటాయించింది.
Rabi Crops | త్రినేత్ర న్యూస్ : రైతులకు (farmers) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి నిర్దేశిత రబీ పంటల (Rabi Crops) కనీస మద్దతు ధరల పెంపునకు (MSP hike) ఆమోదం తెలిపింది. రబీ పంటల్లో కుసుమ పంటకు మద్దతు ధరను అత్యధికంగా క్వింటాల్‌పై రూ.675 పెంచారు. ఆ తర్వాత ఆవాలకు రూ.413 పెంపు ప్రకటించారు. మసూర్ పప్పు క్వింటాకు రూ.390, బార్లీ క్వింటాకు రూ.136, శనగలు క్వింటాకు రూ.83, గోధుమలు క్వింటాపై రూ.25 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కుసుమ గింజలకు మద్దతు ధర క్వింటాల్ రూ.7,215కు, ఆవాలు క్వింటాల్ కనీస ధర రూ.6,613కు చేరింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ఈ పెంపు చేసినట్లు కేంద్రం తెలిపింది.
'పీఎమ్ ధార'కు రూ.1,86,405 కోట్లు కేటాయింపు
దేశంలో పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘పీఎమ్ ధార’ (PM DHARA) పథకానికి కేబినెట్ రూ.1,86,405 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 135 గిగావాట్ల (GW) పునరుత్పాదక ఇంధనాన్ని జాతీయ గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానించనున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు 50 GWh సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) అమలుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అంబులెన్సులకు గ్రీన్ కారిడార్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను తక్షణమే గుర్తించి, రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను టెక్నాలజీతో గుర్తించనున్నారు. రోడ్డు భద్రతను పెంచడమే కాకుండా ప్రమాదాల నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగకరం.
Also Read..
బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు
జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
సంబంధిత వార్తలు

PM DHARA Scheme | పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ఊతం.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధారా స్కీం..
సెప్టెంబర్ 30, 2026

MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సెప్టెంబర్ 30, 2026

KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!
- ●OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు



