Harish Rao | రాజస్థాన్‌కు 800 మెగావాట్ల సింగరేణి కరెంటా?
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఒకవైపు కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే.. మరోవైపు తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు.
- రాష్ట్రంలో కళ్లెదుటే పంటలు ఎండుతున్నయ్
- ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయడం ప్రజావ్యతిరేక చర్య
- సింగరేణి తెలంగాణ ఆస్తి
- ఒప్పందం వెనుక ఆంతర్యం ఏంటీ?
- జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలి
- ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు బహిరంగ లేఖ
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఒకవైపు కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే.. మరోవైపు తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు సింగరేణి గనుల్లోనే ఉందని, నీళ్లు పక్కనే ఉన్న గోదావరి నుంచి పుష్కలంగా అందుతాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది. అలాంటప్పుడు ఇక్కడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? మన బొగ్గు, మన నీళ్లు, మన ప్రాంతంలో తయారయ్యే కరెంటుపై హక్కు తెలంగాణదే కదా?’ అని ప్రశ్నించారు.
రూ.22 వేల కోట్ల ప్రాజెక్టు ఎందుకు?
ఇటీవల సింగరేణి సంస్థ రాజస్థాన్‌కు చెందిన ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ (RRVUNL) విద్యుత్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొత్తగా నిర్మించే థర్మల్ విద్యుత్‌లో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు కేటాయిస్తారని హరీశ్‌రావు తెలిపారు. అంతేకాక రాజస్థాన్‌లో 1,500 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడుతున్నారని, ఇది దాదాపు రూ.22 వేల కోట్ల భారీ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణి. అలాంటి సింగరేణి విద్యుత్‌ను, పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలి? మన రాష్ట్రమే కరెంటు లేక అల్లాడుతున్న వేళ ఈ తొందరపాటు నిర్ణయం ఎందుకు?’ అని హరీశ్‌రావు నిలదీశారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ లోటును అధిగమించేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రాజెక్టులు నిర్మించారని హరీశ్‌రావు చెప్పారు. వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా అందించలేకపోతోందని విమర్శించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం 7–8 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ‘ఈ పవర్ హాలిడేలతో రైతులు కన్నీరు పెడుతుంటే, పాలనా వైఫల్యాన్ని ఎల్‌నినో మీదకు నెట్టి తప్పించుకోవాలని చూడటం సరికాదు’ అని అన్నారు.
నాసిరకం బొగ్గుతో ప్లాంట్లకు నష్టం
ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు కునారిల్లుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ‘దేశంలో మరెక్కడా లేని విధంగా కేసీఆర్ గారు నిర్మించిన 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ ప్లాంటు.. నేడు యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. దానికి జీ10, జీ11 నాణ్యత గల బొగ్గు వాడాల్సి ఉండగా.. నాసిరకమైన జీ13, జీ14 బొగ్గును వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారు. బొగ్గు కొరతతో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది’ అని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలని తెలిపారు. ‘కానీ కనీస నిల్ఉత్పత్తి ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతున్న మీరు.. విద్యుత్ కేంద్రాల వద్ద ఎందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిలదీసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ వెళ్తే పోలీసులను పెట్టి అడ్డుకోవడం నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు.
ఎన్టీపీసీ విద్యుత్‌ను ఎందుకు వద్దన్నారు?
రాష్ట్ర విభజన సమయంలో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. అందులో భాగంగా ఎన్టీపీసీ 1600 మెగావాట్లు రాష్ట్రానికి ఇస్తామంటే ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు. ‘రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా వచ్చే ఈ విద్యుత్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఎందుకు చెప్పింది?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లు ఉంచారు. రాజస్థాన్‌తో చేసుకున్న విద్యుత్ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. జైపూర్‌లో ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను వంద శాతం తెలంగాణే వినియోగించుకునేలా రాష్ట్ర డిస్కంలతోనే (PPA) అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం కేంద్రాల్లో బొగ్గు కొరత లేకుండా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకొని.. రాష్ట్రంలోని రైతులు, ప్రజల కరెంటు కష్టాలను తీర్చాలన్నారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పార్టీ రైతులు, ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Boddemma Festival | రేపట్నుంచి 'బొడ్డెమ్మ' పండుగ
- ●Supreme Court | బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం.. తీవ్రమవుతున్న అమ్మకాల ఒత్తిడి..
- ●Sangareddy Elderly Couple Suicide | తీవ్ర విషాదం: ముగ్గురు కొడుకులున్నా ఆదరణ కరవు.. బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
- ●Samsung | వినియోగదారులకు షాకిచ్చిన శాంసంగ్.. ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- ●Telangana Graduate MLC Elections | సీఎం రేవంత్‌ను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం

Boddemma Festival | రేపట్నుంచి 'బొడ్డెమ్మ' పండుగ

Supreme Court | బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు

Stock Markets | స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం.. తీవ్రమవుతున్న అమ్మకాల ఒత్తిడి..

Sangareddy Elderly Couple Suicide | తీవ్ర విషాదం: ముగ్గురు కొడుకులున్నా ఆదరణ కరవు.. బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య






