Bhu Bharati | భూభారతి రిఫండ్లలో అధికారుల నిర్వాకం..
Bhu Bharati | రంగారెడ్డి జిల్లాలో భూభారతి పోర్టల్ పనితీరు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూ లావాదేవీల నిమిత్తం స్లాట్ బుక్ చేసుకుని, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న దరఖాస్తుదారులకు చెల్లించిన రుసుము తిరిగి రావడం లేదు.
కోర్టుకెక్కితే తప్ప నగదు జమ చేయడం లేదు
3,961 స్లాట్ల రద్దు.. ముగ్గురికే రిఫండ్
రంగారెడ్డి జిల్లాలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
Bhu Bharati | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లాలో భూభారతి పోర్టల్ పనితీరు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూ లావాదేవీల నిమిత్తం స్లాట్ బుక్ చేసుకుని, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న దరఖాస్తుదారులకు చెల్లించిన రుసుము తిరిగి రావడం లేదు. స్లాట్ రద్దు చేసుకున్న వారి సంఖ్య వేలల్లో ఉంటే, అధికారులు రిఫండ్ చేసిన వారి సంఖ్య కేవలం ముగ్గురు మాత్రమే కావడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
కోర్టు ధిక్కరణ కేసు వేస్తేనే కదిలిన ఫైలు..
తాజా సమాచారం ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,961 మంది దరఖాస్తుదారులు తమ ధరణి స్లాట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం, స్లాట్ రద్దయిన వెంటనే దరఖాస్తుదారుడి ఖాతాలో ఆ రుసుము ఆటోమేటిక్‌గా జమ కావాల్సి ఉంటుంది. అయితే నెలలు గడుస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. నిరీక్షించి విసుగుచెందిన కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించారు. అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో, ఏకంగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి రావడంతో దిగివచ్చిన అధికారులు.. కోర్టును ఆశ్రయించిన ఆ ముగ్గురికి మాత్రమే నగదు వాపసు (రిఫండ్) చేయడం గమనార్హం.
అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
కోర్టు కేసులు వేయలేని, న్యాయ పోరాటం చేయలేని మిగతా 3,958 మంది సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న వారందరికీ వెంటనే రిఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

High Court’s Verdict | హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి కలెక్టర్కు జైలు శిక్ష
నవంబర్ 9, 2026

Patnam Narender Reddy | ప్రజా పాలనే కదా..! భయమెందుకు రేవంత్ రెడ్డి..!!
నవంబర్ 9, 2026

ORR Road accident | దీపావళి పండగ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండగా రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే!
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..
- ●Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ
- ●Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్ఫ్లో..
- ●Kedarnath | కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్కు బయల్దేరిన ఉత్సవ పల్లకి
- ●Telangana | వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●N Ramachander Rao | అది ‘యాంటీ భారత్ సమ్మిట్’

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..

Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ

Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్ఫ్లో..

Kedarnath | కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్కు బయల్దేరిన ఉత్సవ పల్లకి



