Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా
Formula E Racing case | ఫార్ములా-ఈ రేసింగ్ కేసు (Formula E Racing case)కు సంబంధించి విచారణనను నాంపల్లి ఏసీబీ కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది.
Formula E Racing case | త్రినేత్ర న్యూస్: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు (Formula E Racing case)కు సంబంధించి విచారణనను నాంపల్లి ఏసీబీ కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది. కేటీఆర్ (KTR) తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్‌ను కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో తదుపరి విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ కేసులో కేటీఆర్‌తో పాటు A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 బి.ఎల్.ఎన్. రెడ్డి, A4 గోవెడ కిరణ్ మల్లేశ్వర్ రావు మాత్రం కోర్టుకు హాజరయ్యారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ- రేసు నిధుల బదిలీలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం విదితమే. కేబినెట్ అనుమతి లేకుండా దాదాపు రూ.55 కోట్ల నిధులు మళ్లించారంటూ ఏసీబీ ఆరోపించింది. అయితే ఈ కేసులో ఛార్జ్‌షీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ కేటీఆర్ ఇప్పటికే నాంపల్లి ఏసీబీ కోర్టులో ఈనెల 12 'డిశ్చార్జ్ పిటిషన్' దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈరోజు విచారణకు కేటీఆర్ హాజరు కాకపోవడంతో కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 4కు పొడిగించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!
- ●Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: బండి సంజయ్
- ●Seethakka | గ్రామాలు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.. దేశంలోని తొలిసారి ఉత్తర్వులు
- ●Supreme Court | ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం
- ●Fine Rice Price | సన్న బియ్యం ధరలకు రెక్కలు.. నాలుగు నెలల్లో 25 శాతం పెరుగుదల
- ●Alphabet | గూగుల్‌కు ఏఐ దెబ్బ.. ఒక్కరోజే 511 బిలియన్ డాలర్ల నష్టం..

Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!

Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: బండి సంజయ్

Seethakka | గ్రామాలు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.. దేశంలోని తొలిసారి ఉత్తర్వులు

Supreme Court | ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం



