త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | వియ‌త్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?

RS Praveen Kumar | వియ‌త్నాంకు చెందిన గ్రీన్ ఎస్ఎం (Green SM) కంపెనీకి తెలంగాణలో ప‌ర్మిష‌న్ ఇచ్చిందెవ‌ర‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ (RS Praveen Kumar) ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 12, 2026, 1.25 pm IST

RS Praveen Kumar | వియ‌త్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
Advertisement
  • ఏఐసీసీ ఆఫీసులో మూట‌లు గుమ్మ‌రించి ఆ కంపెనీ తెలంగాణ‌కొచ్చింది
  • జియో లెక్క‌నే గ్రీన్ SM అనే కంపెనీ ద‌గా చేయబోతోంది
  • మంత్రి పొన్నం ఎందుకు అడ్డుకోలే?
  • రేవంత్‌రెడ్డి 6 ల‌క్ష‌ల మంది క్యాబ్ డ్రైవ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టారు
  • గ్రీన్ SM కంపెనీని బ్యాన్ చేసి తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు రేటు కార్డు అమల్లోకి తేవాలి
  • బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ ప్ర‌వీణ్‌కుమార్ డిమాండ్‌

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్‌: వియ‌త్నాంకు చెందిన ‘గ్రీన్ ఎస్ఎం’ (Green SM) కంపెనీకి తెలంగాణలో ప‌ర్మిష‌న్ ఇచ్చిందెవ‌ర‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ (RS Praveen Kumar) ప్ర‌శ్నించారు. జియో లెక్క‌నే ఆ కంపెనీ కూడా ద‌గా చేయ‌బోతుంద‌ని.. ఏఐసీసీ ఆఫీసులో మూట‌లు గుమ్మ‌రించి తెలంగాణకు తెచ్చార‌ని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి 6 ల‌క్ష‌ల మంది క్యాబ్ డ్రైవ‌ర్ల (Cab Drivers) పొట్ట కొడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఈ కంపెనీని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎందుకు అడ్డుకోలేద‌ని నిల‌దీశారు. గ్రీన్ ఎస్ఎం కంపెనీనీ బ్యాన్ చేసి తెలంగాణ క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రేటు కార్డు తేవాల‌ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

2016లో జియో అనే కంపెనీ ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అనే ఆఫర్‌తో రాగానే ఎయిర్‌సెల్, టాటా డొకోమో, రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ కనుమరుగైతే వొడాఫోన్, ఐడియా మెర్జ్ అయ్యాయి. ఆ తర్వాత కోట్ల మంది కస్టమర్లు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా జియో వాళ్లు రేట్లు పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు గ్రీన్ ఎస్ఎం అనే కంపెనీ కూడా అదే చేయబోతోంది. ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను వాళ్ల పనులు బంద్ చేసి తమతో కలవాలని సిగ్నల్స్ ఇస్తుంది. మొదట వారానికి రూ.8000 ఇస్తామని అంటారు.. మెల్లమెల్లగా దాన్ని రూ.1000కి చేస్తారు. ఒక కంపెనీ తన అడ్వర్టైజింగ్ కోసం ఆటో డ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తుంది. ఇదంతా చూసి కూడా రేవంత్ రెడ్డి దీనికి పర్మిషన్ ఇచ్చాడు.

నెల నుంచే హైద‌రాబాద్‌లో తిరుగుతున్న‌య్‌

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన చేస్తుంది. వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ఎం క్యాబ్‌లు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ క్యాబ్‌లు హైదరాబాద్‌లో నెల రోజుల నుంచి తిరుగుతున్నాయి. దీంతో మన క్యాబ్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.

రేటు కార్డు ఇవ్వాలి

టామ్ కామ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆటో డ్రైవర్లకు రేటు కార్డు ఇచ్చినట్లే.. క్యాబ్ డ్రైవర్లకు రేటు కార్డు ఇవ్వాలి. గ్రీన్ ఎస్ఎం క్యాబ్ కిలో మీటర్ కు 8 రూపాయలు తీసుకుంటున్నారు. రేటు తక్కువ ఉన్న క్యాబ్ నే కస్టమర్లు బుక్ చేసుకుంటారు.

ఢిల్లీ, బెంగ‌ళూరులో ఆందోళ‌న‌లు చేస్తున్న‌రు

గ్రీన్ ఎస్ఎం కంపెనీ బెంగుళూరుకు రావడంతో గొడవ జరుగుతుంది. ఢిల్లీలోనూ ఆందోళన చేస్తున్నారు. పార్టనర్ షిప్ పేరుతో నగరంలో నడిపిస్తున్నారు. ఆ కంపెనీ GST లు కట్టడం లేదు. ఇందిరమ్మ పాలనలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్లను దోచుకుంటున్నారు. వియత్నాం గ్రీన్ ఎస్ఎం కంపెనీకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచాడు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రేటు కార్డు ఎందుకు ఇవ్వడం లేదు?

క్యాబ్ డ్రైవర్ల 10 వేల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ పాలనలో ఇందిరా పార్క్ వద్ద నిరసనలకు అనుమతి లేదు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు రేటు కార్డు అమల్లోకి తేవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement