త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhilesh Yadav | 2027 ఎన్నిక‌ల్లో బీజేపీకి శాశ్వ‌త ఓట‌మి త‌ప్ప‌దు : అఖిలేష్ యాద‌వ్‌

Akhilesh Yadav | గోపాలకులను (cowherds) ఉద్దేశించి చులకనగా మాట్లాడటం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ (CM Yogi Adityanath) సాక్షాత్తూ శ్రీకృష్ణుడినే (Lord Krishna) అవమానించారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదంటూ తీవ్రంగా హెచ్చరించారు.

D

National | Published On Nov 12, 2026, 1.01 pm IST

Akhilesh Yadav | 2027 ఎన్నిక‌ల్లో బీజేపీకి శాశ్వ‌త ఓట‌మి త‌ప్ప‌దు : అఖిలేష్ యాద‌వ్‌
Advertisement

Akhilesh Yadav | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై (CM Yogi Adityanath) సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గోపాలకులను (పశువుల కాపరులను) ఉద్దేశించి చులకనగా మాట్లాడటం ద్వారా ముఖ్యమంత్రి సాక్షాత్తూ శ్రీకృష్ణుడినే (Lord Krishna) అవమానించారని ఆరోపించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదంటూ తీవ్రంగా హెచ్చరించారు.

నిన్న ల‌క్నోలో జ‌రిగిన‌ ఉత్త‌రాఖండ్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో సీఎం యోగి మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. "ఉత్త‌రాఖండ్ ఆడ‌బిడ్డ (డింపుల్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ) లేక‌పోయి ఉంటే ఆయ‌న త‌న సొంత ఊరైన ఇటావాలోని సైఫైలో గేదెల‌ను మేపుతూ ఉండేవారు" అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్య‌ల‌కు అఖిలేష్ తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు.

ఈ మేర‌కు యోగి మాట్లాడిన వీడియోను త‌న ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. యోగి ఆదిత్యనాథ్ త‌న‌ వ్యాఖ్యల ద్వారా శ్రీకృష్ణుడిని అవమానించారని విమ‌ర్శించారు. "గోపాలకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పరోక్షంగా గోపాలుడైన శ్రీకృష్ణుడిని ముఖ్యమంత్రి అవమానించారు. ఇది క్షమించరాని నేరం" అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్య‌వ‌హారంలో అస‌లైన సూత్ర‌ధారుల‌ను ప్ర‌భుత్వం కాపాడుతోందని, నిజం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతో కేవ‌లం కింది స్థాయి సిబ్బందిని మాత్రమే అరెస్టు చేసి అసలు నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చార‌ని అఖిలేష్ ఆరోపించారు.

2027లో బీజేపీకి ఓటమి తప్పదు

"2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ‌లు, ఇత‌ర ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌ముల భ‌యంతో మీ మాట‌లు అదుపుత‌ప్పాయి. మీరు గెలుపు బాట‌లో ఉంటే మీ విజ‌యాల గురించి మాట్లాడేవారు. అంతేకానీ మా గురించి మాట్లాడరు. 5% అహంకార శక్తులకు, 95% పీడీఏ (PDA) ప్రజలకు మధ్యే 2027 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు" అని అఖిలేష్ యాద‌వ్ పేర్కొన్నారు.

Also Read..

ఒవైసీ కొత్త‌ ఎత్తుగ‌డ‌.. యూపీలో మూడో ఫ్రంట్‌..!

అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి ఫొటోలు చూశారా..?

బుల్లెట్ గాయాల‌తో ఇద్ద‌రు పోలీసుల‌ మృత‌దేహాలు.. ఉగ్ర‌వాదుల ప‌నేనా..?

Advertisement
Advertisement