Women’s Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య
Women's Commission | ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అగ్రివర్సిటీ (Agricultural University) వీసీ అల్దాస్ జానయ్య (VC Janaiah) గురువారం మహిళా కమిషన్ (Women's Commission) ఎదుట విచారణ (Investigation)కు హాజరయ్యారు.
Women's Commission | త్రినేత్ర న్యూస్: ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అగ్రివర్సిటీ (Agricultural University) వీసీ అల్దాస్ జానయ్య (VC Janaiah) గురువారం మహిళా కమిషన్ (Women's Commission) ఎదుట విచారణ (Investigation)కు హాజరయ్యారు. జానయ్యపై వచ్చిన అభియోగాలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే విచారణ చేపట్టగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
ఇదీ కేసు నేపథ్యం..
వీసీ జానయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పీహెచ్‌డీ గడువు పొడిగింపు కోసం వెళ్లినప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించారని, నిరాకరించడంతో నిజామాబాద్‌కు బదిలీ చేశారని ఆమె పేర్కొన్నారు. అయితే వీటిని వీసీ జానయ్య ఖండించారు. తన వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డులతో సహా పూర్తి స్థాయి డిజిటల్ ఆధారాలపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెట్టాలని ఇయన ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఉత్తర్వుల్లో తెలిపారు. 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ఆయన సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఈ కమిటీకి అవసరమైన సహకారం అందించాలని, బాధితురాలి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు

Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
నవంబర్ 12, 2026

RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
నవంబర్ 12, 2026

EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు
- ●India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
- ●Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
- ●Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్
- ●Stock Market | 75 శాతం వరకు లాభాలిచ్చే 10 స్టాక్స్.. ధరలు కూడా తక్కువే..
- ●Supreme Court | విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు.. ఎన్నారైలకు సుప్రీం బిగ్ షాక్

Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు

India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం

Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్



