Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్‌మెంట్ – ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్
బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ హౌజ్‌లోనే ఓ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా శివ కోసం అతడి ప్రియురాలు ప్రియాంక జైన్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా అభిమానులతో పంచుకుంది.
Entertainment | Published On Nov 12, 2026, 2.02 pm IST
Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రేమాయణాలు కొత్తేమీ కాదు. బిగ్‌బాస్ షోలో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నాయి. కానీ బిగ్‌బాస్ హౌజ్‌లోనే ఓ జంట ఎంగేజ్‌మెంట్ జరిగింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే నిశ్చితార్థం జరుపుకున్న తొలి జంటగా శివ కుమార్, ప్రియాంక జైన్ నిలిచారు.
ప్రోమో రిలీజ్...
వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుకల తాలూకు ప్రోమోను బిగ్‌బాస్ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరు హౌజ్‌లోకి అడుగుపెడుతున్నారు. తమ వారి ఆటతీరు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఎంగేజ్‌మెంట్...
శివ కోసం అతడి ప్రియురాలు ప్రియాంక జైన్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. ప్రియాంకను చూడగానే ఆనందం పట్టలేకపోయాడు శివ. తాము బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నామని ప్రియాంక ప్రకటించింది. మిగిలిన కంటెస్టెంట్ అందరూ ఈ నిశ్చితార్థ వేడుకలో భాగమయ్యారు. హౌజ్‌లోనే ఉంగరం చూపించి నన్ను పెళ్లిచేసుకుంటావా అని ప్రియాంక జైన్‌ను శివ అడిగాడు. ఎస్ అంటూ సిగ్గుపడుతూ ప్రియాంక బదులిచ్చింది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రియాంక అడిగిన ప్రశ్నకు శివ కూడా అవునని బదులిచ్చాడు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...
ఆ తర్వాత ఉంగరాలతో పాటు ఇద్దరు దండలు మార్చుకున్నారు. ప్రియురాలితో కలిసి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు శివ. ఈ సందర్భంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీన్‌కు రీక్రియేట్ చేశారు. తనకు కాబోయే భార్య ప్రియాంక జైన్‌తో కలిసి హౌజ్‌లోకి అడుగుపెడుతున్నట్లు శివ చెప్పాడు. నేను నాకు కాబోయే వారు శివకుమార్‌తో కుడి కాలు పెట్టి బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నా అంటూ ప్రియాంక జైన్ చెప్పింది. ప్రోమో వైరల్ అవుతోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఎంగేజ్‌మెంట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.
సీరియల్స్‌తో...
శివకుమార్, ప్రియాంక జైన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కలిసి మౌనరాగం అనే సీరియల్‌లో నటించారు.ఆ టైమ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రియాంక జైన్ సీరియల్స్‌తో పాటు కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ప్రియాంక జైన్ ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. ఫైనల్ చేరుకుంది. కానీ కప్ గెలవలేకపోయింది.
ట్రోల్స్...
ఎంగేజ్‌మెంట్ ప్రోమోపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కొన్ని టీవీ షోస్ కోసం ప్రియాంక జైన్, శివకుమార్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కేవలం టీఆర్‌పీ కోసమే బిగ్‌బాస్ హౌజ్‌లో ఈ జోడీ మళ్లీ నిశ్చితార్థం చేసుకున్నారని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం శివకుమార్, ప్రియాంక జైన్‌కు ఇప్పటికే పెళ్లి కూడా అయ్యిందంటూ కామెంట్లు పెడుతోన్నారు.
FIRST-EVER IN BIGG BOSS HISTORY! 💍
Shiva & Priyanka's Engagement Makes the House Extra Special! 💞
Don't miss this Beautiful Celebration of Love! 😍👁️Watch #BiggBossSeason10Telugu Mon - Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & Stream 24/7 on #JioHotstar
#StarMaaPromo https://t.co/Al3aEleLeT
— Starmaa (@StarMaa) November 11, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? – ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
నవంబర్ 6, 2026

Telugu Serial Actress | విడాకులు తీసుకున్న అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్
అక్టోబర్ 13, 2026

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ – క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు
- ●India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
- ●Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
- ●Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య
- ●Stock Market | 75 శాతం వరకు లాభాలిచ్చే 10 స్టాక్స్.. ధరలు కూడా తక్కువే..
- ●Supreme Court | విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు.. ఎన్నారైలకు సుప్రీం బిగ్ షాక్

Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు

India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం

Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య



