EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ
EFLU | యూజీసీ నెట్ (UGC NET) పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) శుభవార్త అందించింది.
EFLU | త్రినేత్ర న్యూస్: యూజీసీ నెట్ (UGC NET) పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) శుభవార్త అందించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ అభ్యర్థులకు యూజీసీ నెట్ (ఇంగ్లీష్) పరీక్ష కోసం ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ (Online Coaching) అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 16 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. మాస్టర్స్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చదువుతున్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. డిసెంబర్ 2026లో జరగనున్న యూజీసీ నెట్ పరీక్షకు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి ugcschemes@efluniversity.ac.inకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు 040-27689481 నంబర్‌ను సంప్రదించవచ్చు. దరఖాస్తుల ఎంపికలో యూనివర్సిటీదే తుది నిర్ణయమని అధికారులు వెల్లడించారు
వెబ్‌సైట్: https://www.efluniversity.ac.in/
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
- ●Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్
- ●Tummala Nageswara Rao | పండ్ల మార్కెట్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి
- ●TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం
- ●Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..
- ●2027 UP Elections | ఒవైసీ కొత్త ఎత్తుగడ.. యూపీలో మూడో ఫ్రంట్..!

RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?

Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్

Tummala Nageswara Rao | పండ్ల మార్కెట్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి

TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం




