Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
Green India Challenge | ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో, ప్రతి స్కూల్లో ఉసిరి, బిల్వ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రతి ఇంటా ఉసిరి-ప్రతి గుడిలో బిల్వం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని రాజ్యసభ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్‌కుమార్తె (Joginapally Santhosh Kumar) లిపారు.
- యాదాద్రి జిల్లా మహాదేవపురం సంతాన వేణుగోపాల స్వామి- మహాదేవ ఆలయంలో మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
Green India Challenge | త్రినేత్ర న్యూస్: ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో, ప్రతి స్కూల్లో ఉసిరి, బిల్వ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రతి ఇంటా ఉసిరి-ప్రతి గుడిలో బిల్వం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని రాజ్యసభ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్‌కుమార్తె (Joginapally Santhosh Kumar) లిపారు. యాదాద్రి (Yadadri) జిల్లా మహాదేవపురం సంతాన వేణుగోపాల స్వామి - మహాదేవ దేవాలయంలో గురువారం ఉసిరి, బిల్వం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భక్తి భావాన్ని ప్రకృతి పరిరక్షణతో మేళవిస్తూ, మన సంప్రదాయ వృక్ష సంపదను భావితరాలకు అందించడమే ఈ హరిత సంకల్పం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ఈ కార్తీక మాసంలో అటు ఆరోగ్యం, ఇటు భక్తి పెంపొదించేలా ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఉసిరి, బిల్వ మొక్కలను ప్రతి ఊరికి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కందడి రవణమ్మ, సర్పంచ్ దండం అనిత ప్రభాకర్, కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, ఎక్స్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ రైతు సమన్వయ కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్, దేవాలయ మాజీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, చెంగల్ కిషన్ రావు, పిట్టల అశోక్, స్వామి గౌడ్, మధు, వంశీ, రమేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు
- ●India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
- ●Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్
- ●Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య
- ●Stock Market | 75 శాతం వరకు లాభాలిచ్చే 10 స్టాక్స్.. ధరలు కూడా తక్కువే..
- ●Supreme Court | విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు.. ఎన్నారైలకు సుప్రీం బిగ్ షాక్

Sai Pallavi | తల్లి పాత్రలో సాయిపల్లవి - మూడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలు

India Visa Rules | భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు

Bigg Boss | బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్

Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య







