త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | మూడోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివ‌ర్స్‌

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మ‌రోసారి వివాహ బంధానికి ముగింపు ప‌ల‌క‌నున్నారు. ఆయ‌న మూడో భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

G

Entertainment | Published On Nov 10, 2026, 6.15 am IST

Pawan Kalyan | మూడోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివ‌ర్స్‌
Advertisement

Pawan Kalyan | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) మ‌రోసారి వివాహ బంధానికి ముగింపు ప‌ల‌క‌నున్నారు. ఆయ‌న మూడో భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ‌ 13 ఏండ్ల త‌మ వివాహ బంధానికి వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు (Divorce) వెల్లడించారు. ఈమేర‌కు పవన్ కళ్యాణ్, అన్నా దంపతులు సోమవారం (నవంబర్ 9) రాత్రి సంయుక్త ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

`మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు.. మా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాన్ని కలిసి పంచుకున్న తర్వాత పరస్పర గౌరవం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మేమిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతాం. మా పిల్లలకు ఎప్పటికీ అంకితభావం గల తల్లిదండ్రులుగా ఉంటాం. వారి సంతోషం, శ్రేయస్సే మా ఇద్దరి మొదటి ప్రాధాన్యత`అని అందులో పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, అభిమానులను కోరారు. విడాకుల ప్రక్రియ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, దయచేసి అందరూ ఈ కష్ట సమయంలో తమను అర్థం చేసుకుని దయతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నేండ్ల‌ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మూడోసారి..

పవన్ కల్యాణ్, రష్యన్ జాతీయురాలైన అన్నా లెజినోవా 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు. పవన్ హీరోగా నటించిన `తీన్ మార్` సినిమాలో అన్నా లెజినోవా ఒక చిన్న పాత్రలో కనిపించారు. అప్పుడు మొద‌లైన వీరి పరిచయం పెండ్లికి దారితీసింది. కాగా, పవన్ కు ఇది మూడో వివాహం అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన నందిని (1997-2008), రేణూ దేశాయ్ (2009-2012) లను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు.

Advertisement
Advertisement