త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2027 UP Elections | ఒవైసీ కొత్త‌ ఎత్తుగ‌డ‌.. యూపీలో మూడో ఫ్రంట్‌..!

2027 UP Elections | 2027 ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల (2027 UP Elections) నేప‌థ్యంలో రాష్ట్రంలో మూడో రాజ‌కీయ కూట‌మి రూపుదిద్దుకుంటోంది. చంద్ర‌శేఖ‌ర్ అజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని అజాద్ స‌మాజ్ పార్టీ (కాన్షీరామ్ - ASP), అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) పార్టీలు కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు పార్టీలు పొత్తుపై నేడు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

D

National | Published On Nov 12, 2026, 12.23 pm IST

2027 UP Elections | ఒవైసీ కొత్త‌ ఎత్తుగ‌డ‌.. యూపీలో మూడో ఫ్రంట్‌..!
Advertisement
  • ASP-AIMIM కొత్త కూట‌మి..
  • దళిత, మైనారిటీ ఓటర్లను ఏకం చేయడ‌మే ల‌క్ష్యం
  • పొత్తుపై నేడు అధికారిక ప్ర‌క‌ట‌న‌

2027 UP Elections | త్రినేత్ర న్య‌స్ : 2027 ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో మూడో రాజ‌కీయ కూట‌మి రూపుదిద్దుకుంటోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA), సమాజ్‌వాదీ పార్టీ (SP)-కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ (INDIA) కూటములకు ప్రత్యామ్నాయంగా మ‌రో కూట‌మి రాబోతోంది. చంద్ర‌శేఖ‌ర్ అజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని అజాద్ స‌మాజ్ పార్టీ (కాన్షీరామ్ - ASP), అస‌దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) పార్టీలు కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. నేడు ల‌క్నోలో జ‌ర‌గ‌నున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఆజాద్, ఒవైసీ ఈ పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

దళిత, ముస్లిం ఓట్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఈ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రెండు పార్టీలు రాష్ట్రంలో సీట్ల స‌ర్దుబాటు స‌హా కూట‌మికి సంబంధించిన విధివిధానాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 200 స్థానాల్లో ఈ కొత్త కూటమి కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 40-45 స్థానాల్లో AIMIM పోటీ చేయాలని భావిస్తుండగా, దాదాపు 150 నియోజ‌క‌వ‌ర్గాల్లో అజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ద‌ళితులు 21 శాతం, ముస్లింలు 19 శాతంగా ఉన్నారు. ఈ రెండు వ‌ర్గాలు క‌లిపి రాష్ట్ర జ‌నాభాలో దాదాపు 40 శాతం వ‌ర‌కూ ఉంటాయి. ఈ రెండు వ‌ర్గాల‌ ఓటు బ్యాంకును ఏకం చేయడం ఈ కూటమి ప్రధాన లక్ష్యంగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రోహిల్‌ఖండ్ ప్రాంతాల్లోని దళిత, ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై ఈ కూటమి ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల నాటికి మ‌రికొన్ని చిన్న ప్రాంతీయ‌ పార్టీలు కూడా ఈ కూట‌మిలోకి ఆహ్వానించే అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది.

మ‌రోవైపు అజాద్ పార్టీ ఇప్పటికే 87 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 38 మంది షెడ్యూల్డ్ కులాల (SC) వారు, 29 మంది ఓబీసీ (OBC) వర్గాలకు చెందినవారు, 19 మంది ముస్లింలు, ఒకరు సిక్కు వర్గానికి చెందినవారు ఉన్నారు. రాష్ట్రంలో దళిత ఓటర్లను బలంగా ఆకర్షించిన బీఎస్పీ (BSP) క్రమంగా బలహీనపడుతుండటంతో.. ఆ ఖాళీని భర్తీ చేయాల‌ని అజాద్ పార్టీ చూస్తోంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపిన దళిత, ముస్లిం ఓటర్లను ఈ కొత్త కూటమి ఎంతవరకు ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read..

బుల్లెట్ గాయాల‌తో ఇద్ద‌రు పోలీసుల‌ మృత‌దేహాలు.. ఉగ్ర‌వాదుల ప‌నేనా..?

అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి ఫొటోలు చూశారా..?

14న గిగ్ వ‌ర్క‌ర్ల‌తో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు

Advertisement
Advertisement