త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్ల‌లో మ‌గ్గిపోవ‌డ‌మే వారికి స‌రైన శిక్ష : సుప్రీంకోర్టు

Cyber Criminals | సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు (Cyber Criminals) స‌మాజంలో చోటు లేద‌ని, వారు జైళ్లలో (prison) మగ్గిపోవడానికి మించి వేరే దేనికీ అర్హులు కారని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Nov 6, 2026, 5.26 pm IST

Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్ల‌లో మ‌గ్గిపోవ‌డ‌మే వారికి స‌రైన శిక్ష : సుప్రీంకోర్టు
Advertisement

Cyber Criminals | త్రినేత్ర న్యూస్ : విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతున్న సైబ‌ర్ నేరాల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మ‌రోసారి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు (Cyber Criminals) స‌మాజంలో చోటు లేద‌ని స్ప‌ష్టం చేసింది. వారు జైళ్లలో (prison) మగ్గిపోవడానికి మించి వేరే దేనికీ అర్హులు కారని వ్యాఖ్యానించింది. సైబర్ మోసం కేసుకు సంబంధించిన నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్య‌లు చేసింది. దీపావళి తర్వాత లొంగిపోతాన‌న్న నిందితుడి విజ్ఞప్తిని కోర్టు తిర‌స్క‌రించింది. "నువ్వు లొంగిపోవాల్సిన పనిలేదు.. పోలీసులే చూసుకుంటారు" అని తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించింది.

"మేము సైబర్ నేరగాళ్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాము. వారికి మా నుంచి ఎలాంటి సానుభూతి లభించదు. సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు. కేవ‌లం జైళ్లు మాత్ర‌మే వారికి సరైన స్థానం" అని ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ అన్నారు. హత్యలు చేసి జైలుకెళ్లిన వారికైనా జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో కలిసిపోయే అవకాశం ఉంటుందని, కానీ సైబర్ నేరగాళ్లకు మాత్రం ఆ అవ‌కాశం ఉండ‌ద‌ని పేర్కొంది. సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. వారికి జైలు త‌ప్ప జీవించేందుకు వేరే ఎక్క‌డా స్థానం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇటీవలే ఇదే ధర్మాసనం డిజిటల్ అరెస్టులతో కూడిన సైబర్ నేరాలను (cybercrimes) డిజిటల్ దోపిడీగా అభివ‌ర్ణించిన విష‌యం తెలిసిందే. “డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాలు డిజిటల్ దోపిడీ కిందకే వస్తాయి. ఇటువంటి వ్యక్తులకు ఎలాంటి న్యాయపరమైన రక్షణ కల్పించే ప్రసక్తే లేదు” అని ధర్మాసనం తేల్చిచెప్పింది. సైబర్ మోసగాళ్లపై జీరో ఎఫ్‌ఐఆర్‌ల ద్వారా క్రిమినల్ చర్యలు ప్రారంభించాల‌ని ఆదేశించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టు ప్రస్తావించింది.

ఆ నివేదిక ప్రకారం.. డిజిటల్ అరెస్టులకు వ్యతిరేకంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులు 2024లో 1,23,672 కాగా, 2025 నాటికి ఆ సంఖ్య‌ 58,249కి తగ్గింది. ఇక ఈ ఏడాది జూన్ 30 నాటికి 16,377గా ఉన్నాయి. ఇ-జీరో ఎఫ్‌ఐఆర్ (e-Zero FIR) విధానం 19 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చినప్పటికీ.. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కీలకమైన 'స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను' (S4C) కేవలం 14 రాష్ట్రాలు మాత్రమే అధికారికంగా నోటిఫై చేశాయని కోర్టు పేర్కొంది.

Also Read..

క్లాస్ రూమ్‌లో కుప్ప‌కూలి.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి

పాత బ‌స్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు

రేపు న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డే.. మ్యాచ్‌కు వాన‌గండం..?

Advertisement
Advertisement