త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru | ఏడాది నుంచి..శవమై మిగిలినా.. పట్టించుకున్నవారే లేరు

Bengaluru | బెంగళూరులోని ఓ ఇంట్లో (Bengaluru)లో ఓ మహిాళ చనిపోయి దాదాపుగా ఏడాదైంది. కానీ.. ఈ విషయాన్ని పట్టించుకున్నవారే లేరు. రెండేండ్లుగా కూతురూ ఈమెను పలకరించలేదు

D

National | Published On Aug 8, 2026, 3.12 pm IST

Bengaluru | ఏడాది నుంచి..శవమై మిగిలినా.. పట్టించుకున్నవారే లేరు
Advertisement

Bengaluru | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు (Bengaluru)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో మ‌హిళ అస్థిపంజ‌రం బ‌య‌ట‌ప‌డ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఆ మ‌హిళ ఏడాది క్రిత‌మే మ‌ర‌ణించి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. మ‌హిళను 52 ఏళ్ల దాక్షాయినిగా గుర్తించారు. ఆమె కుమారుడు 2005లో క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు. కుమారుడి మ‌ర‌ణంతో ఆమె తీవ్ర డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయింది. ఆమెకు కుటుంబ స‌భ్యులు బెంగ‌ళూరు, బెళ‌గావి ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. దాక్షాయిని స్కిజోఫ్రెనియా (తీవ్రమైన‌ మానసిక కుంగుబాటుకు)తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స కోసం ఆమె దాదాపు నాలుగు నెల‌లు రిహాబిలేష‌న్ సెంట‌ర్‌లో కూడా ఉన్న‌ట్లు ఆమె సోదరుడు మహేష్ బసప్ప తెలిపారు.

2017లో ఆమె భ‌ర్త కూడా మ‌ర‌ణించాడ‌ని.. అప్ప‌టి నుంచి దాక్షాయిని ఒంట‌రిగానే నివ‌సిస్తున్న‌ట్లు చెప్పారు. గత రెండేళ్లుగా ఆమె కుటుంబ స‌భ్యుల‌తో కూడా క‌ల‌వ‌లేద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఏడాదిగా మ‌హిళ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇరుగుపొరుగువారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా.. మ‌హిళ అస్థిపంజ‌రం బ‌య‌ట‌ప‌డింది. ఆమె సంవ‌త్స‌రం క్రిత‌మే చ‌నిపోయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌హిళ‌కు కుమార్తె, అల్లుడు కూడా ఉన్న‌ట్లు స్థానికులు తెలిపారు. అయితే, ఏడాదిగా ఆమెను చూసేందుకు వాళ్లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కుటుంబ స‌భ్యులు ఉన్నా అనాథ‌లే

ఇటీవ‌లే హర్యానాలోని సోనిపట్ ఓ తండ్రి చనిపోతే చివ‌రి చూపుకు కూడా కూతుళ్లు రాక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఓ కూతురు వీడియో కాల్ ద్వారా అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన తీరు అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. క‌న్న తండ్రిని క‌డ‌సారి చూసేందుకు కూడా టైమ్ లేదా అంటూ నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం చేశారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే.. తాజాగా క‌న్న కూతురు ఉన్నా ఆ త‌ల్లి చ‌నిపోయిన విష‌యాన్ని కూడా గుర్తించ‌లేని ప‌రిస్థితి రావ‌డం గ‌మ‌నార్హం.

ఈ తరహా సంఘటనలు చూస్తుంటే నేటి సమాజంలో మానవ సంబంధాలు, బాధ్యతల పట్ల తీవ్రమైన ఆందోళనను, ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. కన్న తండ్రిని చూడటానికి రాలేకపోవడం, కన్నతల్లి చనిపోయినా గమనించలేకపోవడం వంటి ఘ‌ట‌న‌లు సమాజంలో నైతిక విలువలు ఎంత వేగంగా క్షీణిస్తున్నాయో చెప్పడానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read..

యూఏఈలో బ‌తుక‌మ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

కేటీఆర్‌కు హాఫ్‌ నాలెడ్జ్‌..

లోకేష్ క‌న‌గ‌రాజ్ వ‌ర్సెస్ కొరియ‌న్ క‌న‌క‌రాజులో ఫ‌స్ట్ డే విన్న‌ర్ ఎవ‌రంటే?

Advertisement
Advertisement