త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | డీలిమిటేషన్ సాకుతో మహిళలకు బీజేపీ ద్రోహం : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | డీలిమిటేష‌న్ సాకుతో మ‌హిళ‌ల‌కు బీజేపీ ద్రోహం చేస్తుంద‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త నుంచి మొద‌లుకుంటే.. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు బీజేపీ ద్రోహం చేస్తూనే ఉంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Aug 8, 2026, 3.50 pm IST

Ponguleti Srinivas Reddy | డీలిమిటేషన్ సాకుతో మహిళలకు బీజేపీ ద్రోహం : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : డీలిమిటేష‌న్ సాకుతో మ‌హిళ‌ల‌కు బీజేపీ ద్రోహం చేస్తుంద‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త నుంచి మొద‌లుకుంటే.. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు బీజేపీ ద్రోహం చేస్తూనే ఉంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

బీజేపీ మ‌హిళా వ్య‌తిరేక పార్టీ అని దేశ‌మంత‌టికీ తెలుసు. బీజేపీ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు కేటాయించ‌లేదు. అదే కాంగ్రెస్ పార్టీ అయితే దేశానికి తొలి ప్రెసిడెంట్‌గా మ‌హిళ‌ను నియ‌మించింది. అంతేకాదు.. తొలి ప్ర‌ధాని కూడా మ‌హిళ‌నే. పార్టీలోనూ మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌పీట వేసింద‌ని, ప‌లు ప‌ద‌వుల‌ను వారికి క‌ట్ట‌బెట్టింద‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.

దేశ వ్యాప్తంగా ప‌లువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లైంగిక దాడుల కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి ప‌ట్ల బీజేపీ పార్టీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా వారిని ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. మహిళల పురోగతికి, సాధికారతకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన సాకుతో మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఆలస్యం చేస్తోంది. ఈ చ‌ట్టం అమ‌లును ఆలస్యం చేయకుండా, ఎలాంటి ష‌ర‌తులు విధించ‌కుండా అమ‌లు చేయాల‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement