Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాకు మించిన బడ్జెట్‌తో…
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగులో ఓ ప్రయోగం చేయబోతుంది. ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మనీ హైస్ట్ తరహాలో సాగే ఈ సిరీస్‌కు లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నారు.
Entertainment | Published On Aug 8, 2026, 3.41 pm IST
Meenakshi Chaudhary | సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజుతో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లను అందుకుంది మీనాక్షి చౌదరి. వందల కోట్ల వసూళ్లతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ఈ సక్సెస్‌లతో మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళంలో ఈ అమ్మడికి ఆఫర్లు పెరిగాయి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఓ ప్రయోగానికి సిద్ధమైంది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమాలకు మించిన బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతుంది.
మనీ హైస్ట్
సార్, లక్కీ భాస్కర్ సినిమాల ఫేమ్ వెంకీ అట్లూరి ఓటీటీటీలోకి ఎంట్రీ ఇస్తూ ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మనీ హైస్ట్ తరహాలో బ్యాంకింగ్ స్కామ్‌ల బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అతడికి జోడీగా మీనాక్షి చౌదరి కనిపించబోతున్నది.
తెలుగులో ఓటీటీ హిస్టరీలోనే కాస్ట్‌లీయెస్ట్ వెబ్‌సిరీస్‌గా ఇది తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఇరవై కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి ఇద్దరి పాత్రలు నెగెటివ్ టచ్‌తో సాగుతాయని సమాచారం.
నెట్‌ఫ్లిక్స్
ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తెలుగులో మీనాక్షి చౌదరికి ఇది ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్. హిందీలో అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్‌లో నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తోనే మీనాక్షి యాక్టింగ్ జర్నీ మొదలైంది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో వృషకర్మ సినిమా చేస్తోంది మీనాక్షి చౌదరి. అలాగే తమిళంలో కార్తీతో ఓ సినిమాను అంగీకరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Main Vaapas Aaunga | ‘మై వాపస్ ఆవూంగా’… నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే…
ఆగస్టు 6, 2026

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే – స్ట్రీమింగ్ ఎందులో …ఎప్పుడంటే?
ఆగస్టు 4, 2026

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ – ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు
- ●Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
- ●Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
- ●Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు
- ●Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్

Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!

Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..



