Chanagani Dayakar | హరీశ్‌రావ్.. చెంపలేసుకొని నిరుద్యోగులకు సారీ చెప్పు
Chanagani Dayakar | ప్రతి ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిన ఘనత ప్రజా పాలనదేనని.. రేవంత్ పాలనను చూసైనా హరీశ్ రావు సిగ్గు తెచ్చుకోవాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఫైరయ్యారు. హరీశ్ రావు చెంపలేసుకొని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- రేవంత్ పాలనను చూసైనా సిగ్గు తెచ్చుకో
- పదేళ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయని దుర్మార్గులు మీరు
- మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఫైర్
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: ప్రతి ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిన ఘనత ప్రజా పాలనదేనని.. రేవంత్ పాలనను చూసైనా హరీశ్ రావు సిగ్గు తెచ్చుకోవాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయని దుర్మార్గులు మీరు అని మండిపడ్డారు. హరీశ్ రావు చెంపలేసుకొని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలన, హరీశ్‌రావుపై నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ పదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రేవంత్ రెడ్డి పాలన చూసి హరీశ్ రావు సిగ్గు తెచ్చుకోవాలి. గతంలో ఉద్యోగాలు అడిగితే లాఠీఛార్జ్‌లు చేసి జైల్లో పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులది. రాష్టంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలలో విశ్వాసం నింపారు. హరీష్ రావు పదేళ్ల పాలనలో మంత్రిగా పని చేసి కనీసం హోంగార్డ్ పోస్టింగ్ అయినా ఇప్పించారా అని సూటి ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదు. పదేళ్లు నిరుద్యోగులకు ద్రోహం చేసిన దుర్మార్గులు హరీష్ రావు. నిరుద్యోగుల కోసం యంగ్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీలు పెట్టి తెలంగాణ నైపుణ్యం గల విద్యను అందించాలనే సంకల్పం సీఎం రేవంత్ రెడ్డికి ఉంది అని చనగాని దయాకర్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Recycling | భారతీయుల కొత్త ట్రెండ్.. బంగారాన్ని అమ్మడం లేదు..
- ●Damodar Raja Narasimha | మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభానికి సిద్ధం : మంత్రి దామోదర
- ●Ramchander Rao | 'సర్'లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు
- ●Bengaluru | ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం.. ఏడాది క్రితమే మృతి
- ●CP Sajjanar | అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్లతో వల.. తస్మాత్ జాగ్రత్త!
- ●KTR | యూఏఈలో బతుకమ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Gold Recycling | భారతీయుల కొత్త ట్రెండ్.. బంగారాన్ని అమ్మడం లేదు..

Damodar Raja Narasimha | మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభానికి సిద్ధం : మంత్రి దామోదర

Ramchander Rao | 'సర్'లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు

Bengaluru | ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం.. ఏడాది క్రితమే మృతి




